ఆ వూరంతా క్యాన్సర్ పేషంట్లే.. ఒక్క గ్రామంలో ఇంతమందా..? ఏం జరుగుతోంది..?

First Published Jul 21, 2018, 2:53 PM IST
Highlights

దేశంలోని ఒక్కో వూరికే ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.. ఒక వూళ్లో గుడి ఫేమస్.. మరో వూరిలో బడి ఫేమస్.. లేదంటే మరోదైనా ఉండి వుండవచ్చు. కానీ ఊరిలో వుండే వారందరూ క్యాన్సర్ పేషేంట్లు అయ్యింటే..?

దేశంలోని ఒక్కో వూరికే ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.. ఒక వూళ్లో గుడి ఫేమస్.. మరో వూరిలో బడి ఫేమస్.. లేదంటే మరోదైనా ఉండి వుండవచ్చు. కానీ ఊరిలో వుండే వారందరూ క్యాన్సర్ పేషేంట్లు అయ్యింటే..? ఒక వూరిలో ఉంటేగింటే నలుగురైదుగురు క్యాన్సర్ పేషేంట్లు ఉంటారు. అంతేకానీ ఊరు ఊరంతా క్యాన్సర్ బారిన ఎలా పడతారు. మధ్యప్రదేశ్‌లోని హర్సోలా గ్రామం మనం ఇప్పటిదాకా చెప్పుకుంటున్న క్యాన్సర్ గ్రామం.

ఈ గ్రామంలో క్యాన్సర్ బారినపడి ఇప్పటి వరకూ 15 మంది చనిపోయారు.. మరో 20 మంది మృత్యువుతో పోరాడుతున్నారు. గత మూడేళ్ల నుంచి ఈ గ్రామంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. బాధితులు తమకు క్యాన్సర్ సోకిందని తెలిసేలోగా.. అది అప్పటికే కబళిస్తోంది. ఈ గ్రామం గురించి తెలుసుకున్న ప్రభుత్వం.. ఇందుకు గల కారణాలను వెలికితీసేందుకు ప్రత్యేక వైద్య బృందాలను అక్కడికి పంపింది..

దీనిలో భాగంగా మొత్తం ఆరువేల మంది నుంచి వివరాలు సేకరించారు. తాగునీటికి సంబంధించిన పరీక్షలు నిర్వహించారు.. అయినా ఏ ఒక్కటి సత్ఫలితాన్ని ఇవ్వకపోవడంతో... వైద్యులు క్యాన్సర్ కారకాలను గుర్తించేందుకు పరిశోధనలు జరుపుతున్నారు.. వారి ఆహారపు అలవాట్లు, వారసత్వంగా ఈ వ్యాధి ఎవరికైనా వచ్చిందా అన్న దానిపై ఆరా తీస్తున్నారు. 

click me!