ఢిల్లీకి ఉగ్రముప్పు: ఆగష్టు 15 లోపుగా డ్రోన్ దాడికి చాన్స్, వార్నింగ్

Published : Jul 20, 2021, 04:12 PM IST
ఢిల్లీకి ఉగ్రముప్పు: ఆగష్టు 15 లోపుగా డ్రోన్ దాడికి చాన్స్, వార్నింగ్

సారాంశం

ఢిల్లీలో ఉగ్రదాడులు జరిగే ఛాన్స్ ఉందని నిఘా వర్గాల హెచ్చరించాయి.  ఆగష్టు 15 లోపుగా భారీ దాడి జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.ఈ విషయమై పోలీసులు అప్రమత్తమయ్యారు 


న్యూఢిల్లీ: స్వాతంత్ర్యదినోత్సవానికి ముందు  ఢిల్లీలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘావర్గాలు హెచ్చరించాయి. పేలుడు పదార్ధాలు నిండిన డ్రోన్ల సహాయంతో దాడులు జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో  డ్రోన్  జిహార్ ముప్పును ఎదుర్కొనేందుకు ఢిల్లీ పోలీసులు సన్నద్దమయ్యారు.  ఈ మేరకు  పోలీసులకు శిక్షణ ఇస్తున్నారు. 

ఉగ్రవాద నిరోధక చర్యలపై  శిక్షణ ఇవ్వాలని ఆయా జిల్లాల పోలీసులకు ఆగష్టు 15 లోపుగా శిక్షణ ఇవ్వనున్నారు. నగరంలోని డ్రోన్ లకు సంబంధించిన సమాచారం గురించి జిల్లాలోని ఎస్‌హెచ్‌ఓలు తెలుసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు.ఎర్రకోట వద్ద నాలుగు యాంటీ డ్రోన్ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నా,రు. గత ఏడాది ఈ ప్రాంతంలో రెండు డ్రోన్లతో భద్రతను పర్యవేక్షించారు.30వేల మంది పోలీసులు నగరంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా సింగు, తిక్రి, ఘాజిపూర్ సరిహద్దుల సమీపంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. గత ఏడాది నుండి ఈ ప్రాంతాల్లో రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

 
 

PREV
click me!

Recommended Stories

Aadhaar Card New Rules : 2026లో ఆధార్ అప్‌డేట్ చేయాలంటే ఈ పత్రాలు తప్పనిసరి !
Jobs : కేవలం జనవరి ఒక్క నెలలోనే.. లక్ష ఉద్యోగాల భర్తీకి సర్కార్ సిద్దం