లవర్ బర్త్ డే సెలబ్రేట్ చేద్దామనుకున్నాడు.. చివరకు...

Published : Jul 20, 2021, 03:01 PM IST
లవర్ బర్త్ డే సెలబ్రేట్ చేద్దామనుకున్నాడు.. చివరకు...

సారాంశం

 వారిద్దరినీ జంటగా చూసిన గ్రామస్తులు ఊర్లోకి తీసుకొచ్చారు. ఇద్దరికీ పెళ్లి చెయ్యాలని నిర్ణయించారు. 

తాను ప్రేమించిన అమ్మాయి పుట్టిన రోజు చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని అనుకున్నాడు.  ఎవరికీ తెలీకుండా గ్రాండ్ గా సెలబ్రేషన్స్ కూడా చేశాడు. ఆ తర్వాత యువతిని సీక్రెట్ గా పొలాల్లోకి తీసుకువెళ్లి.. మాట్లాడదామనుకున్నాడు. కానీ.. యువతి గ్రామస్థులు యువకుడికి ఊహించని షాక్ ఇచ్చారు. అక్కడికక్కడే యువతితో పెళ్లి చేసేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కొత్వాలి గ్రామానికి చెందిన సత్యం తన ప్రేయసి జన్మదినోత్సవాన్ని జరిపేందుకు గత ఆదివారం ఆమె గ్రామానికి చేరుకున్నాడు. ఆమెను పొలాల్లోకి తీసుకెళ్లాడు. వారిద్దరినీ జంటగా చూసిన గ్రామస్తులు ఊర్లోకి తీసుకొచ్చారు. ఇద్దరికీ పెళ్లి చెయ్యాలని నిర్ణయించారు. సమీప పోలీస్ స్టేషన్‌కు, సత్యం తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఇరు వర్గాల మధ్య వాదనలు, చర్చలు జరిగిన తర్వాత పెళ్లికి అబ్బాయి తరఫు వారు అంగీకరించారు. 

యువతి దళిత పేద కులానికి చెందినది కావడంతో అమె పెళ్లికి సహాయం చేసేందుకు గ్రామస్తులందరూ ముందుకు వచ్చారు. దీంతో ఆదివారం వారిద్దరికీ పెళ్లి జరిగింది. గ్రామస్తులందరూ చందాలు వేసుకుని అబ్బాయికి మంచం, ఫ్రిజ్, టీవీ తదితర సామాగ్రి కొనిచ్చారు. 

PREV
click me!

Recommended Stories

అధికారులను పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్ | CM Joseph Vijay Distributes Ration to Families
తమిళనాడులో విద్యుత్ బస్ స్టేషన్ లను పరిశీలించిన సీఎం విజయ్ | CM Vijay Inspects EV MTC Bus Depo