ఆ సేవకు ఫలితం.. నిత్యానంద 'కైలాస' దేశానికి ప్రధానిగా నటి రంజిత !

Published : Jul 07, 2023, 03:58 AM IST
ఆ సేవకు ఫలితం.. నిత్యానంద 'కైలాస' దేశానికి ప్రధానిగా నటి రంజిత !

సారాంశం

వివాదాస్పద స్వామి నిత్యానంద భారత్ నుంచి తప్పించుకుని ఆయన స్వయంగా సృష్టించిన 'కైలాస దేశ' ద్వీపానికి మాజీ నటి రంజితను ప్రధానమంత్రిగా ప్రకటించారని ప్రముఖ తమిళ దినపత్రిక ఇటీవల ఒక నివేదికను ప్రచురించింది. 

వివాదాలకు కేరాఫ్ అడ్రాస్ స్వామి నిత్యానంద.  అత్యాచార ఆరోపణ తీవ్రతరం కావడంతో స్వామి నిత్యానంద దేశం నుంచి పారిపోయారు. అనంతరం తనకంటూ ప్రత్యేకంగా ఓ దేశాన్ని సృష్టించుకున్నాడు. దానికి యునైటెట్ స్టేట్స్ ఆఫ్ కైలాస (కైలాస దేశ) అని పేరు పెట్టుకున్నాడు. ప్రత్యేక కరెన్సీ, ప్రత్యేక పాలన ను ఏర్పాటు. అయితే..తాజాగా ఈ దేశంలో మరోసారి వార్తల్లో నిలిచింది.  ఆ దేశానికి తన ప్రియ శిష్యురాలైన మాజీ నటి రంజితను ప్రధానిమంత్రిగా ప్రకటించుకున్నట్లు ఓ ప్రముఖ తమిళ పత్రిక వెల్లడించింది. ఈ మేరకు నిత్యానంద వెబ్‌సైట్‌లోనూ ప్రకటించారని పేర్కొనడం కూడా అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.  

నిత్యానంద వెబ్ సైట్ లో నిత్యానంద.. రంజిత ఫొటోలు మాత్రమే ఉన్నాయి. మాజీ నటి తనని తాను  ‘నిత్యానందమయ స్వామి’ అని పేర్కొన్నది. ఈ వ్యవహరాన్ని చూస్తుంటే.. హిందువుల కోసం ఏర్పాటైన ఆ దేశ ప్రధానిగా రంజితను ప్రకటించే అవకాశమున్నట్టు తెలుస్తోంది.  పలు తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో నటించిన రంజిత ఎంతో మంది అభిమానులకు సొంత చేసుకుంది. కెరీర్ మంచి ఫీక్స్ లో ఉన్న సమయంలో నిత్యానంద చెంత చేరింది. ఇదిలా ఉంటే.. ఇటీవల కౌలాస దేశం తరుపున ఐక్యరాజ్య సమితి సమావేశంలో మహిళా రాయబారులు పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే.. తర్వాత జరుగబోయే సమావేశాలకు రంజిత ప్రధానిగా పాల్గొన్నా ఆశ్చర్యపోనవసరం లేదు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం