ప్రమాదంలో భర్తను కోల్పోయి.. అపస్మారక స్థితిలో వర్ధని.. సాయం కోసం ఎదురుచూపు..

Published : May 26, 2022, 05:01 PM ISTUpdated : May 26, 2022, 05:07 PM IST
ప్రమాదంలో భర్తను కోల్పోయి.. అపస్మారక స్థితిలో వర్ధని.. సాయం కోసం ఎదురుచూపు..

సారాంశం

వర్ధని ఖేమ్‌చంద్ అనే మహిళకు భర్త, 11 ఏళ్ల కొడుకు ఉన్నారు. ఉన్నంతలో కుటుంబంతో ఆనందంగా జీవనం సాగిస్తున్నారు. అయితే ఇటీవల ఆమె జీవితం ఊహించని మలుపు తిరిగింది. ప్రమాదంలో భర్తను కోల్పోయిన ఆమె.. ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.  

వర్ధని ఖేమ్‌చంద్ అనే మహిళకు భర్త, 11 ఏళ్ల కొడుకు ఉన్నారు. అందరిలాగానే వర్ధని కూడా తన కుటుంబానికి సంతోషకరమైన, సంతృప్తికరమైన జీవితాన్ని ఇవ్వాలని కలలు కన్నారు. ఉన్నంతలో కుటుంబంతో ఆనందంగా జీవనం సాగిస్తున్నారు. అయితే ఇటీవల ఆమె జీవితం ఊహించని మలుపు తిరిగింది. రోడ్డు ప్రమాదంలో భర్తను కోల్పోయిన ఆమె.. ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. త్వరగా కోలుకుని తన కొడుకును చూసుకోవాల్సిన బాధ్యత ఆమెపై ఉంది. అయితే ఆమె చికిత్సకు భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ మొత్తం భరించే స్థోమత లేకపోవడంతో.. సాయం చేయాల్సిందిగా వారి ఫ్రెండ్స్ దాతలను కోరుతున్నారు. ఆమె చికిత్సకు అవసరమైన డబ్బుల కోసం సుహాస్ చానేకర్ అనే వ్యక్తి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి వివరాలను క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌ Impact Guru ధ్రువీకరించింది. 

వర్ధని ఖేమ్‌చంద్‌కు ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతుంది. గత నాలుగు రోజులు ఆమె అపస్మార స్థితిలో ఉంది. ప్రస్తుతం ఆమెకు బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది. ఈ ప్రమాదంలో వర్దని.. ఆమె భర్తను కోల్పోయింది. ఇప్పుడు ఆమె తన 11 ఏళ్ల కొడుకు చూసుకోవాల్సి ఉంది. ఆమె చికిత్స కోసం మేము రూ. 2 లక్షలు ఖర్చు చేశాం. అయితే రానున్న 7 నుంచి 10 రోజుల చికిత్స నిమిత్తం రూ. 30 లక్షల ఖర్చువుతుంది. అందుకే చికిత్సను కొనసాగించడానికి డబ్బులు కావాలి. 

ప్రతి ఒక్కరికి జీవితంలో ఎన్నో కలలు, ఆకాంక్షలు ఉంటాయి. వాటిని సాధించడానికి జీవితాంతం ఎంతగానో కృషి చేస్తాం. అందరిలాగానే వర్ధని కూడా తన కుటుంబానికి సంతోషకరమైన, సంతృప్తికరమైన జీవితాన్ని ఇవ్వాలని కలలు కన్నారు. కుటుంబం అవసరాలు, కోరికలు నెరవేర్చేలా కృషి చేశారు. కానీ ఆ కలలు చెరిగిపోయాయి. ఇప్పుడు ఆమె ప్రాణాలతో అపస్మారక స్థితిలో ఉన్నారు. దీంతో ఆమె కుటుంబం తీవ్ర బాధను అనుభవిస్తున్నారు.

2022 మే 22న వర్ధని, ఆమె భర్త వారి 11 ఏళ్ల కొడుకుతో కలిసి ఒక ప్రమాదానికి గురయ్యారు. అది ఆమెకు, ఆమె కుటుంబానికి జీవితాంతం మరిచిపోలేని విషాదాన్ని మిగిల్చింది. ఆమె శరీరంపై తీవ్రమైన గాయాలు ఉన్నాయి. ఇప్పటికే ఆమె వెన్నుపాము, కుడి చేతికి పెద్ద శస్త్రచికిత్స జరిగింది. ఈ ప్రమాదం కారణంగా ఆమె కొడుకుకు skull surgery జరిగింది. అయితే ఆమెకు మరిన్ని సర్జరీలు చేయాల్సి ఉంది. ఆసుపత్రిలో మరింత కాలం ఉండాలని వైద్యులు సూచించారు.

ఈ దురష్టకర ఘటనలో ఆమె చాలా కష్టతరమైన సమయాన్ని అనుభవిస్తుంది. ఆమె ఆరోగ్యం కూడా భయంకరంగా క్షీణిస్తుంది. సకాలంలో చికిత్స లేకుంటే.. కొన్ని తీవ్రమైన శాశ్వత నష్టాలు కలగవచ్చు. అయితే చికిత్స అనేది భారీ ఖర్చుతో కూడుకున్నది. ఆమె చికిత్సకు 10 రోజులకే రూ. 30 లక్షలు కావాల్సి ఉంది. చికిత్స ఖర్చు మరింతగా పెరగనుంది. వైద్యులు తదుపరి చికిత్సను, అవసరమైన మొత్తాన్ని మాకు తెలియజేస్తారు. దయగల మానవతావాదులు ఆమెను ఆదుకోవడానికి పెద్ద సంఖ్యలో ముందుకు వస్తేనే ఆమెకు చికిత్స అందుతుంది. ఆమె కుటుంబం ఇప్పటికే వారు పొదుపు చేసిన మొత్తాన్ని ఖర్చు చేసింది. ఆమెకు సకాలంలో వైద్యం అందించడానికి ఎటువంటి అవకాశాన్ని వదిలిపెట్టలేదు. వారు చేయగలిగినదంతా చేశారు. ఆమె కుటుంబం ఇప్పుడు దాతల కోసం ఎదురుచూస్తుంది. వర్ధిని చికిత్స కోసం అయ్యే మొత్తాన్ని డొనేట్ చేయండి అని సుహాస్ చానేకర్‌ కోరారు. 

నిధుల సమీకరణకు సంబంధించిన బ్యాంక్ ఖాతాకు నేరుగా డబ్బులు బదిలీ చేయవచ్చు. అయితే ఈ ఖాతా వివరాలపై అంతర్జాతీయ లావాదేవీలు అనుమతించబడవు. కేవలం INR బదిలీలు మాత్రమే అనుమతించబడతాయి. అంతేకాకుండా ఈ లింక్‌పై క్లిక్ చేసి.. అందులో Donate Now బటన్‌పై క్లిక్ చేసి డబ్బులు డొనేట్ చేయవచ్చు. వీరికి ట్యాక్స్ బెనిఫిట్స్ వర్తిస్తాయి.

- Account number : 2223330011817893
- Account name : Vardhani Kemchand
- IFSC code : RATN0VAAPIS (ఇక్కడ N తర్వాత ఉన్నది సున్న)
- Bank Name: RBL Bank
For UPI Transaction: assist.vardhani@icici

(Image credit- Impact Guru) 

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu