రానున్న 5 రోజులు దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు : ఐఎండీ

Published : Jul 08, 2023, 02:59 AM IST
రానున్న 5 రోజులు దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు : ఐఎండీ

సారాంశం

New Delhi: రోజంతా అడపాదడపా కురిసిన వర్షంతో శుక్రవారం సాయంత్రం ముంబ‌యిలోని పలు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, ప‌లు ప్రాంతాల్లో వ‌ర‌ద‌లు, ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో గోవా, కేరళ ప్రభుత్వాలు పాఠశాలలకు సెలవు ప్రకటించాయి. జులై 11 వ‌ర‌కు 8 రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని ఐఎండీ అంచ‌నా వేసింది.   

IMD forecasts heavy rainfall in 8 states: ఆల‌స్యంగా ప్ర‌వేశించిన రుతుప‌వ‌నాలు ప్ర‌స్తుతం చురుగ్గా క‌దులుతున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధార‌ణం నుంచి మోస్తారు వ‌ర్షాలు కురుస్తున్నాయి. రోజంతా అడపాదడపా కురిసిన వర్షంతో శుక్రవారం సాయంత్రం ముంబ‌యిలోని పలు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, ప‌లు ప్రాంతాల్లో వ‌ర‌ద‌లు, ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో గోవా, కేరళ ప్రభుత్వాలు పాఠశాలలకు సెలవు ప్రకటించాయి. జులై 11 వ‌ర‌కు 8 రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని ఐఎండీ అంచ‌నా వేసింది. 

వివ‌రాల్లోకెళ్తే.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, రుతుపవనాల ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) తెలిపింది. రాగల ఐదు రోజుల పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని శుక్రవారం అంచనా వేసింది. ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాంలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

"రాబోయే 5 రోజుల్లో సబ్ హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కిం అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ ల‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాగల 5 రోజుల్లో ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే, బీహార్, జార్ఖండ్ ల‌లో కూడా భారీ వ‌ర్షాలు కురుస్తాయి" అని వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కేరళ, కర్నాట‌క‌, గుజరాత్, మహారాష్ట్ర, ఛ‌త్తీస్ గఢ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలకు భారీ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. కొంకణ్, గోవా, గుజరాత్, దక్షిణ ద్వీపకల్పంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

జ‌మ్మూకాశ్మీర్, హిమాచ‌ల్ ప్ర‌దేశ్, పంజాబ్, హ‌ర్యానా, ఉత్త‌ర‌ప్ర‌దేశ్, ఉత్త‌రాఖండ్ ల‌లో రానున్న నాలుగైదు రోజుల్లో తేలికపాటి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. నేడు (జూలై 8న) అమృత్ సర్, గురుదాస్ పూర్, పఠాన్ కోట్, కతువా, ఉధంపూర్, రియాసి, జమ్మూ, రాజౌరీ, పూంచ్, బారాముల్లా, బుద్గాం, అనంత్ నాగ్, శ్రీనగర్, పుల్వామా, కిష్త్వార్, దోడా, చంబా, లాహుల్ అండ్ స్పితి, కాంగ్రా, మండి, సోలన్, సిమ్లా, సిర్మౌర్, యమునానగర్, శరణ్ పూర్, ముజఫర్ నగర్, మీరట్, బిజ్నోర్, జ్యోతిబాపూలే నగర్, సంభాల్, రాంపూర్, మొరాదాబాద్ లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

జూలై 9న అమృత్ సర్, గురుదాస్ పూర్, పఠాన్ కోట్, కటువా, ఉధంపూర్, రియాసి, జమ్మూ, రాజౌరీ, పూంచ్, బారాముల్లా, బుద్గాం, అనంత్ నాగ్, శ్రీనగర్, పుల్వామా, కిష్త్వార్, దోడా, చంబా, లాహుల్ అండ్ స్పితి, కాంగ్రా, మండి, సోలన్, సిమ్లా, సిర్మౌర్, యమునానగర్, శరణ్ పూర్, ముజాఫర్ నగర్, మీరట్, బిజ్నోర్, జ్యోతిబాపూలే నగర్, సంభాల్, రాంపూర్, బిచ్చోర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే, జూలై 10న నైనిటాల్, చంపావత్, అల్మోరా, బాగేశ్వర్, పితోర్గఢ్, అనంత్నాగ్, సిరోహి, పాలి, జల్పాయిగురి, అలీపుర్దువార్, కూచ్ బెహర్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూలై 11న నైనిటాల్, చంపావత్, అల్మోరా, బాగేశ్వర్, పితోర్గఢ్, ఉధమ్ సింగ్ నగర్, జల్పాయిగురి, అలీపుర్దువార్, కూచ్ బెహార్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?