తమిళనాడులో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.. స్కూల్స్, కాలేజ్‌లకు సెలవు..

By Sumanth KanukulaFirst Published Nov 11, 2022, 12:09 PM IST
Highlights

తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాన్నాయి. బంగాళాఖాతంలో శ్రీలంక తీరంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో చెన్నైలోని పలు ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్‌పేట జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.

తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాన్నాయి. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలు పలు ప్రాంతాలను అతలాకుతలం చేసింది. బంగాళాఖాతంలో శ్రీలంక తీరంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో చెన్నైలోని పలు ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్‌పేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రామనాథపురం, కడలూరు, విల్లుపురంతో పాటు రాష్ట్రంలోని పలు తీర ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో.. తమిళనాడు, పుదుచ్చేరిలో పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 

పుదుచ్చేరి, తమిళనాడులోని చెన్నై, తిరువళ్లూరు, కళ్లకురిచ్చి, సేలం, వెల్లూరు, తిరుపత్తూరు, రాణిపేట్, తిరువణ్ణామలై జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలోనే భారీ వర్షాల కారణంగా తమిళనాడులోని చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్‌పట్టు, రాణిపేట్, వెల్లూరు, కడలూరు, మైలాడుతురై, తిరువారూర్, నాగపట్నం, తంజావూరు, విల్లుపురం, అరియలూరు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు శుక్రవారం సెలవు ప్రకటించారు.

తమిళనాడులోని రాణిపెట్టై తిరువణ్ణామలై, తిరువళ్లూరు, చెన్నై, కాంచీపురం, చెంగల్‌పట్టు, విల్లుపురం, కల్లక్కురిచ్చి, కడలూరు, అరియలూర్, పెరంబలూరు, తంజావూరు, మయిలదు తిరువరురై, తిరువూరురై, రాణిప్పేట్టై తిరువణ్ణామలై, పుదుక్కోట్టై, రామనాథపురం మరియు శివగంగై జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. 

ఇక, భారీ వర్షాల దృష్ట్యా పుదుచ్చేరిలో అన్ని పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం శుక్రవారం సెలవు ప్రకటించింది. తమిళనాడులోని చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్‌పట్టు జిల్లాల మాదిరిగానే పాండిచ్చేరిలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

click me!