తమిళనాడులోలో భారీ వర్షాలు, 10 జిల్లాలకు ఆరంజ్ అలర్ట్, నీలగిరిలో విరిగిపడిన కొండచరియలు...

By SumaBala Bukka  |  First Published Nov 6, 2023, 8:29 AM IST

తుఫాను ప్రభావంతో తమిళనాడులో వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఊటీకి రాకపోకలు నిలిచిపోయాయి. 


చెన్నై : భారీ వర్షలతో తమిళనాడు వణికిపోతోంది. గత మూడు,నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. వర్షాల కారణంగా తమిళనాడులో 10 జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ విడుదల చేశారు. చెన్నై, కన్యాకుమారి, కడలూరు సహా పది జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఇక నీలగిరిలో కొండ చరియలు విరిగిపడ్డాయి.

దీంతో.. ఊటీకి వెళ్లే వాహనాలు, రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. కొండచరియలు విరిగిపడి పట్టాలపై పెద్దపెద్ద బండరాళ్లు పడిపోయాయి. వీటిని సిబ్బంది తొలగిస్తున్నారు. వర్షాల కారణంగా దక్షిణ తమిళనాడులో భారీగా పంట నష్టం వాటిల్లింది. 

Latest Videos

undefined

రాజస్థాన్ బీజేపీ నేతపై బహిష్కరణ వేటు.. గురుద్వారాలపై వివాదాస్పద వ్యాఖ్యలతోనే....

ఇదిలా ఉండగా, శ్రీలంక, దానిని ఆనుకుని ఉన్న కొమోరిన్ ప్రాంతంలో తుఫాను ప్రభావం, బంగాళాఖాతం నుంచి ఈస్టర్లీ/ఈశాన్య గాలులు దిగువ ట్రోపోస్ఫెరిక్ స్థాయిలో ప్రవహిస్తుండటంతో దక్షిణ ద్వీపకల్ప భారతంలో రానున్న కొద్ది రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అక్టోబర్ 30న తెలిపింది. ద‌క్షిణాదిలోని దాదాపు అన్ని ప్రాంతాల‌పై దీని ప్రభావం ఉంటుంద‌ని వాతావ‌ర‌ణ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

అక్టోబర్ 30న ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. తెలంగాణలో చాలా ప్రాంతాల్లో మేఘావృత‌మైన వాతావ‌ర‌ణం క‌నిపించింది. అక్టోబర్ 30, 31 తేదీల్లో లక్షద్వీప్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ మీదుగా రానున్న 5 రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 

అక్టోబర్ 30, 31 తేదీల్లో తమిళనాడులో, 30, నవంబర్ 3 తేదీల్లో కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తాజా పశ్చిమ అలజడి నవంబర్ 1 రాత్రి నుండి నవంబర్ 3 వరకు పశ్చిమ హిమాలయ ప్రాంతంలో తేలికపాటి వర్షాలు / హిమపాతానికి కారణమయ్యే అవకాశం ఉందని తెలిపింది. 

click me!