
weather update: దేశంలో రుతుపవనాల ప్రభావం కొనసాగుతోంది. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. రోడ్డు మార్గాలు దెబ్బతిన్నాయి. అనేక ప్రాంతాలు నీట మునగడంతో ముంపు ప్రాంత ప్రజలను సహాయ శిబిరాలకు తరలించారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఛత్తీస్‌గఢ్ సహా మరో 20 రాష్ట్రాల్లో రాబోయే రెండు రోజులపాటు అతి భారీ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు వెలువరించింది.
దేశంలో రుతుపవనాల ప్రభావం విస్తృతంగా కొనసాగుతోంది. రాబోయే 2 రోజుల్లో 20కి పైగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్‌లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షపాతం నమోదవుతుందని, శనివారం నాడు రాజస్థాన్, గుజరాత్, ఒడిశా, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడు, పుదుచ్చేరిలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. జూలై 16న దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ హెచ్చరించింది.
రాజస్థాన్, గుజరాత్ (సౌరాష్ట్ర మరియు కచ్), ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కర్ణాటక (దక్షిణ ఇంటీరియర్), తమిళనాడు, పుదుచ్చేరిలోని ఏకాంత ప్రదేశాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర (విదర్భ, మధ్య), అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, గుజరాత్ ప్రాంతం, గోవా, కొంకణ్, కర్ణాటక (ఉత్తర అంతర్గత ప్రాంతాలు, తీరప్రాంతం) సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కేరళ, తెలంగాణ, ఆంధప్రదేశలలో కూడా మోస్తారు నుంచి పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరిలలోని ఏకాంత ప్రదేశాలలో పిడుగులతో కూడిన ఉరుములతో కూడిన తుఫాను హెచ్చరికలను IMD జారీ చేసింది.
జూలై 17 (ఆదివారం)కు సంబంధించినే వాతావరణ హెచ్చరికలు
చత్తీస్‌గఢ్‌లో రెండో రోజు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అనేక రాష్ట్రాల్లో, భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇందులో ఉత్తరాఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర (విదర్భ), ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, గోవా, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలు ఉన్నాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర (విదర్భ), ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్ (కోస్తా), తమిళనాడు, పుదుచ్చేరిలలోని ఏకాంత ప్రదేశాలలో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇదిలావుండగా, ఈ వారం ప్రారంభం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వానలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గోదావరి నది సమీప ప్రాంతాల్లో పరిస్థితులు దారుణంగా మారాయి.