మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసే అవ‌కాశం.. ఆయ‌న ఇంటివ‌ద్ద భారీగా మోహ‌రించిన బ‌ల‌గాలు

Published : Feb 26, 2023, 11:38 AM IST
మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసే అవ‌కాశం.. ఆయ‌న ఇంటివ‌ద్ద భారీగా మోహ‌రించిన బ‌ల‌గాలు

సారాంశం

New Delhi: లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ విచారణకు ముందు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మ‌నిష్ సిసోడియా రాజ్ ఘాట్ వద్ద భావోద్వేగ ప్రసంగం చేశారు. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను చదువు కొనసాగించాలని కోరిన సిసోడియా, విద్యార్థులు సరిగా చదవకపోతే తాను తిననని అన్నారు. మనీష్ చాచా జైలుకు వెళ్తే పాఠశాలలకు సెలవులు ప్రారంభమయ్యాయని అనుకోవద్దని ఆయ‌న పేర్కొన్నారు.  

Delhi Deputy Chief Minister Manish Sisodia: మద్యం పాలసీ కేసులో సీబీఐ విచారణ నేపథ్యంలో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇంటి ముందు నాలుగు అంచెల బారికేడ్లు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఎఫ్ఏ)తో భద్రతను కట్టుదిట్టం చేశారు. సిసోడియాకు సమన్లు జారీ చేయడాన్ని నిరసిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నిరసన తెలపడంతో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ప్రధాన కార్యాలయం చుట్టూ 144 సెక్షన్ విధించారు. ఉదయం 11 గంటలకు సిసోడియా సెంట్రల్ ఢిల్లీలోని లోధీ రోడ్డులోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ఢిల్లీ ఉపముఖ్యమంత్రికి కేంద్ర దర్యాప్తు సంస్థ సవివరమైన ప్రశ్నలను సిద్ధం చేసిందని స‌మాచారం. ఇదే స‌మ‌యంలో ఆయ‌న‌ను నేడు అరెస్టు చేసే భ‌యాందోళ‌న‌ను ఆమ్ ఆద్మీ (ఆప్) వ్యక్తం చేసింది. 

ఢిల్లీ క్యాబినెట్ లో ఆర్థిక శాఖను కూడా నిర్వహిస్తున్న సిసోడియాకు గత ఆదివారం సీబీఐ సమన్లు జారీ చేసింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ కసరత్తుల‌ను ప్ర‌స్తావిస్తూ ఆయన తన విచారణను వాయిదా వేయాలని కోరారు, ఆ తరువాత, సీబీఐ ఫిబ్రవరి 26 న త‌మ ముందు విచార‌ణ‌కు హాజరుకావాలని కోరింది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న సీబీఐ ప్ర‌ధాన కార్యాల‌యానికి  చేరుకున్నారు. అంత‌కు ముందు ఆప్ కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించిన సిసోడియా భావోద్వేగ ప్ర‌సంగం చేశారు. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను చదువు కొనసాగించాలని కోరిన సిసోడియా, విద్యార్థులు సరిగా చదవకపోతే తాను తిననని అన్నారు. మనీష్ చాచా జైలుకు వెళ్తే పాఠశాలలకు సెలవులు ప్రారంభమయ్యాయని అనుకోవద్దని ఆయ‌న పేర్కొన్నారు.

సిసోడియా రాజ్ ఘాట్ వద్ద మాట్లాడుతూ.. ఆప్ కార్యకర్తలను తన కుటుంబంగా అభివర్ణించారు. 'మీరే నా కుటుంబం. నేను నిజాయితీపరుడిని, కష్టపడి పనిచేసే వ్యక్తిని' అని సిసోడియా అన్నారు. తప్పుడు కేసులో తనను ఈ రోజు అరెస్టు చేస్తార‌ని కూడా సిసోడియా ఆదివారం అన్నారు. 'ఈ రోజు నన్ను తప్పుడు కేసులో అరెస్టు చేస్తారు. జైలుకు వెళతామనే భయం లేదు. ఈ రోజు నన్ను అరెస్టు చేసినప్పుడు నా భార్య, కుటుంబ స‌భ్యులు ఇంట్లో ఒంటరిగా ఉంటారు. నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి' అని సిసోడియా ఆప్ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు.

 

 

ఈ పరిణామాలపై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. "దేవుడు మీతోనే ఉన్నాడు మనీష్. లక్షలాది మంది పిల్లలు, వారి తల్లిదండ్రుల ఆశీస్సులు మీ వెంట ఉన్నాయి. దేశం కోసం, సమాజం కోసం జైలుకు వెళ్లడం శాపం కాదు, అది ఒక మహిమ. మీరు త్వరగా జైలు నుంచి తిరిగి రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. పిల్లలు, తల్లిదండ్రులు, మేమందరం మీ కోసం ఎదురు చూస్తున్నాం" అని ట్వీట్ చేశారు.

 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?