రజనీకాంత్  కుమార్తె ఇంట్లో భారీ చోరీ.. పనిమనిషి, డ్రైవర్ అరెస్ట్..

By Rajesh Karampoori  |  First Published Mar 22, 2023, 7:05 AM IST

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్  ఇంట్లో బంగారం చోరీ జరిగింది.ఈ వ్యవహరంలో ఆమె పనిమనిషి, కారు డ్రైవర్‌ను మంగళవారం అరెస్టు చేశారు. 18 ఏళ్లుగా పనిమనిషిగా పనిచేసిన ఈశ్వరికి ఐశ్వర్య రజనీకాంత్ ఇంటిపై అవగాహన ఉండడంతో పలుమార్లు లాకర్ తెరిచి దొంగిలించింది.


ఐశ్వర్య రజనీకాంత్  ఇంట్లో బంగారం, వజ్రాభరణాల చోరీ జరిగింది. చెన్నైలోని తమ నివాసం నుంచి దాదాపు నాలుగు లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని ఐశ్వర్య చెన్నై తేనంపేట్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుపై పోలీసులు తమదైన శైలిలో విచారణ చేశారు. దీంతో అసలు దొంగలు బయటపడ్డారు. ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో బంగారు, వజ్రాభరణాలు దొంగిలించినందుకు గాను ఆమె ఇంట్లో పనిమనిషి, కారు డ్రైవర్‌ను మంగళవారం అరెస్టు చేశారు.

డ్రైవర్ వెంకటేశం సహకారంతో పనిమనిషి ఈశ్వరి సుమారు 100 తులాల బంగారు ఆభరణాలు, 30 గ్రాముల వజ్రాభరణాలు, నాలుగు కిలోల వెండి ఆభరణాలను అపహరించింది. 18 ఏళ్లుగా పనిమనిషిగా పనిచేసిన ఈశ్వరికి ఐశ్వర్య రజనీకాంత్ ఇంటిపై పూర్తి అవగాహన ఉండడంతో పలుమార్లు లాకర్ తెరిచి దొంగిలించింది.
ఆమెకు లాకర్ తాళాలు ఎక్కడ పెడుతారో తెలుసు.. లాకర్‌ని తెరవడానికి ఆమె  ఆ తాళాలను తరచూ దాన్ని ఉపయోగించేది.

Latest Videos

కొంత కాలంగా నగలు, ఇతర వస్తువులు దోచుకున్నట్లు పోలీసులు తెలిపారు. పనిమనిషి ఆ ఆభరణాలను ఇల్లు కొనడానికి నగలను ఉపయోగించినట్టు గుర్తించారు. అదే సమయంలో ఆమె వద్ద నుంచి ఇంటి కొనుగోలుకు సంబంధించిన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. నటుడు రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ చర్య తీసుకున్నారు.

అసలేం జరిగింది ? 

చోరీ జరిగిన విషయం తెలుసుకున్న ఐశ్వర్య గత నెలలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2019లో తన సోదరి సౌందర్య పెళ్లి కోసం చివరిగా నగలను ధరించినట్లు ఐశ్వర్య తన ఫిర్యాదులో పేర్కొంది. చోరీకి గురైన నగల్లో డైమండ్ సెట్లు, పాత బంగారు ఆభరణాలు, నవరత్న సెట్లు, నెక్లెస్‌లు, బ్యాంగిల్స్ ఉన్నాయి. సోదరి పెళ్లిలో ఆభరణాలు ధరించిన తర్వాత దానిని లాకర్‌లో ఉంచారు. కానీ ఫిబ్రవరి 10న చూసేసరికి ఆభరణాలు కనిపించలేదు. సమాచారం ప్రకారం, ఫిబ్రవరిలో ఐశ్వర్య లాకర్ తెరిచినప్పుడు, నగలు కనిపించకపోవడంతో ఆమె షాక్ అయ్యింది. ఆ తర్వాత ఇంట్లోని కొందరు పనివాళ్లపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

click me!