ఢిల్లీ అల్లర్లపై హైకోర్టు సీరియస్: పోలీసులకు నోటీసులు

By narsimha lodeFirst Published Feb 26, 2020, 11:14 AM IST
Highlights

న్యూఢిల్లీలో అల్లర్లపై ఢిల్లీ హైకోర్టు సీరియస్ అయింది. బుధవారం నాడు ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు నోటీసులు జారీ చేసింది. ఈ విషయమై ఇవాళ మధ్యాహ్నాం విచారణ జరపనుంది. 


న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో  అల్లర్లు, విధ్వంసంపై  ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలపై ఢిల్లీ పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇవాళ మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు   ఈ ఘటనపై హైకోర్టు విచారణ చేయనుంది.

రెండు రోజులుగా ఢిల్లీలో కొనసాగుతున్న అల్లర్ల కారణంగా   ఇప్పికే 18 మంది మృతి చెందారు. ఈశాన్య ఢిల్లీలో   అల్లర్లపై హైకోర్టు సీరియస్ అయింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్  పర్యటన సాగుతున్న సమయంలో  ఢిల్లీలో ఈ అల్లర్లు చోటు చేసుకోవడంపై కేంద్రం సీరియస్ గా  తీసుకొంది. 

Also read:ఢిల్లీలో దారుణం.. సీఏఏ ఆందోళన..యువకుడి తలలోకి డ్రిల్లింగ్ మెషిన్ దించి...

కేంద్ర హోంశాఖ మంత్రి  అమిత్ షా కూడ  ఉన్నతస్థాయి సమీక్షను మంగళవారం నాడు నిర్వహించారు. ఈశాన్య ఢిల్లీలో   అల్లర్లపై కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేశారు. 

పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆర్మీని  రంగంలోకి దించాలని  ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.  ఢిల్లీ పోలీసులు ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకోలేక పోతున్నారని  ఆయన చెప్పారు.ఈ అల్లర్లపై ఢిల్లీ హైకోర్టు విచారణ చేయనుంది.

ఢిల్లీ హైకోర్టు ఈ అల్లర్లపై పోలీసులకు నోటీసులు జారీ చేసింది. మరోవైపు అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో  జాతీయ భద్రతా వ్యవహరాల ఇంచార్జీ అజిత్ ధోవల్  బుధవారం  నాడు పర్యటించారు.  
 

click me!