హవేరి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024

By Siva Kodati  |  First Published Apr 2, 2024, 9:54 PM IST

నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా గతంలో వున్న ధార్వాడ్ సౌత్ లోక్‌సభ స్థానాన్ని రద్దు చేసి 2009లో కొత్తగా హవేరి పార్లమెంట్ స్థానాన్ని ఏర్పాటు చేశారు. గతంలో ధార్వాడ్ నార్త్ పార్లమెంట్, బాగల్ లోక్‌సభ పరిధిలోని గదగ్, రోన్ నియోజకవర్గాలను హవేరి పార్లమెంట్ స్థానంలో కలిపారు. పూర్వపు ధార్వాడ్ సౌత్ లోక్‌సభ స్థానం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. 1952లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి 1999 వరకు కాంగ్రెస్ పార్టీ తప్ప మరో పార్టీ ఇక్కడ గెలవలేదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. 2024 పార్లమెంట్ ఎన్నికల విషయానికి వస్తే.. మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని బీజేపీ తన అభ్యర్ధిగా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ తరపున ఏజీ మథ్‌ బరిలో దిగుతున్నారు.


కర్ణాటకలోని లోక్‌సభ నియోజకవర్గాల్లో మరో కీలకమైన సెగ్మెంట్ హవేరి. ఉత్తర కర్ణాటక ప్రాంతంలో ఈ స్థానానికి ఘన చరిత్ర వుంది. నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా గతంలో వున్న ధార్వాడ్ సౌత్ లోక్‌సభ స్థానాన్ని రద్దు చేసి 2009లో కొత్తగా హవేరి పార్లమెంట్ స్థానాన్ని ఏర్పాటు చేశారు. గదగ్, హవేరి జిల్లాల పరిధిలో ఈ సెగ్మెంట్ విస్తరించి వుంది. హవేరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో శిరాహట్టి (ఎస్సీ), గదగ్, రోన్, హంగల్, హవేరి (ఎస్సీ), బైయాద్గి, హిరేకెరూర్, రాణిబెన్నూర్ శాసనసభ స్థానాలున్నాయి. గతంలో ధార్వాడ్ నార్త్ పార్లమెంట్, బాగల్ లోక్‌సభ పరిధిలోని గదగ్, రోన్ నియోజకవర్గాలను హవేరి పార్లమెంట్ స్థానంలో కలిపారు. ఆ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 17,06,917 మంది. 

హవేరి ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 ..  .. బీజేపీ హ్యాట్రిక్ విజయాలు :

Latest Videos

undefined

పూర్వపు ధార్వాడ్ సౌత్ లోక్‌సభ స్థానం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. 1952లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి 1999 వరకు కాంగ్రెస్ పార్టీ తప్ప మరో పార్టీ ఇక్కడ గెలవలేదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ధార్వాడ్ సౌత్ నుంచి ఎఫ్‌హెచ్ మొహసిన్ 5 సార్లు, ఐజీ సానాది 3 సార్లు, తిమ్మప్ప రుద్రప్ప , బీఎం ముజాహిద్‌లు రెండేసి సార్లు విజయం సాధించారు. 2004లో బీజేపీ నేత మంజునాథ్ కన్నూర్ కాంగ్రెస్ కంచుకోటను బద్ధలుకొట్టి .. ధార్వాడ్ సౌత్‌లో తొలిసారి కాషాయ జెండా రెపరెపలాడించారు. ఇక హవేరి నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు అక్కడ బీజేపీయే గెలుస్తోంది. 2009 నుంచి నేటి వరకు శివకుమార్ ఉడాసి వరుసగా మూడు సార్లు ఎంపీగా గెలుపొందారు. 

హవేరి ఎంపీ (పార్లమెంట్ ) ఎన్నికల ఫలితాలు 2024 .. ఈసారి బరిలో బసవరాజ్ బొమ్మై :

2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో హవేరి పార్లమెంట్ పరిధిలోని 8 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 7 చోట్ల, బీజేపీ ఒక్కచోట విజయం సాధించాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి శివకుమార్ ఉడాసికి 6,83,660 ఓట్లు.. కాంగ్రెస్ నేత డీఆర్ పాటిల్‌కు 5,42,778 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా 1,40,882 ఓట్ల భారీ మెజారిటీతో శివకుమార్ ఉడాసి హవేరిలో హ్యాట్రిక్ విజయం సాధించారు.

2024 పార్లమెంట్ ఎన్నికల విషయానికి వస్తే.. మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని బీజేపీ తన అభ్యర్ధిగా ప్రకటించింది. వీరశైవ లింగాయత్ ప్రాబల్యంతో పాటు నరేంద్ర మోడీ చరిష్మాతో తాను విజయం సాధిస్తానని బొమ్మై ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఏజీ మథ్‌ బరిలో దిగుతున్నారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలో వుండటంతో పాటు హవేరి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ ఈసారి బలంగా వుండటంతో బీజేపీ కంచుకోటను బద్ధలు కొడతానని మథ్ చెబుతున్నారు. 
 

click me!