లాక్‌డౌన్ ఎఫెక్ట్: 'ఉల్లి'తో ఇల్లు చేరుకొన్నాడు

By narsimha lodeFirst Published Apr 26, 2020, 11:34 AM IST
Highlights

లాక్ డౌన్ నేపథ్యంలో ప్రేమ్ మూర్తి పాండే అనే వ్యక్తి ఎలాంటి అవాంతరాలు లేకుండా తన స్వగ్రామానికి చేరుకొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపులను ఆసరాగా చేసుకొని ఆయన తన ఇంటికి చేరుకొన్నాడు. 


న్యూఢిల్లీ: లాక్ డౌన్ నేపథ్యంలో ప్రేమ్ మూర్తి పాండే అనే వ్యక్తి ఎలాంటి అవాంతరాలు లేకుండా తన స్వగ్రామానికి చేరుకొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపులను ఆసరాగా చేసుకొని ఆయన తన ఇంటికి చేరుకొన్నాడు. 

 గుజరాత్ రాష్ట్రంలోని అలహాబాద్ చెందిన ప్రేమమూర్తి పాండే అనే వ్యక్తి ముంబై విమానాశ్రయంలో పనిచేస్తున్నారు.ఆయన  ముంబైలోని అంధేరీ ప్రాంతంలో నివాసం ఉండేవాడు. 

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను విధించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ విధించిన వారం రోజుల పాటు ఇంట్లో నుండి బయటకు వెళ్లకుండా గడిపాడు. అయితే ఈ ప్రాంతంలో జనసాంద్రత ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతంలో అంధేరీ ప్రాంతంలో కరోనా వ్యాప్తి చెందితే ప్రమాదమని ప్రేమ్ మూర్తి భావించాడు.

ముంబై నుండి తన స్వగ్రామానికి వెళ్లాలని ఆయన నిర్ణయం తీసుకొన్నాడు. లాక్ డౌన్ నేపథ్యంలో తన స్వగ్రామానికి వెళ్లేందుకు ఉపాయాన్ని ఆలోచించాడు. నిత్యావసర సరుకుల రవాణాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మినహయింపు ఇచ్చిన విషయాన్ని ప్రేమ్ మూర్తి గుర్తించాడు. దీంతో ఈ అవకాశాన్ని వినియోగించుకొని తన గ్రామానికి చేరుకోవాలని ప్లాన్ చేశాడు.

ముంబైలోని పళ్ల వ్యాపారితో ఆయన ఓ ఒప్పందం చేసుకొన్నాడు. నాసిక్ లోని మార్కెట్‌కు వెళ్లి 1300 కిలోల పళ్లను ట్రక్కును ముంబైకి పంపాడు. అతను మాత్రం అక్కడే ఉన్నాడు. నాసిక్ నుండి తాను అలహాబాద్ కు వెళ్లాలని ప్లాన్ చేశాడు. మార్కెట్ లో ఎక్కువగా డిమాండ్ ఉన్న విషయంపై ఆరా తీశాడు. ఉల్లిగడ్డకు ఎక్కువగా డిమాండ్ ఉన్న విషయాన్ని గుర్తించాడు.

వెంటనే అలహాబాద్ కు ఉల్లిగడ్డ తరలించాలని ప్లాన్ చేసుకొన్నాడు. 25,520 కిలోల ఉల్లిగడ్డను రూ. 77,500లకు కొనుగోలు చేశాడు. కిలోకు రూ. 9.10లకు కొనుగోలు చేశాడు. ఈ ఉల్లిని అలహాబాద్ కు తరలించేందుకు లారీని మాట్లాడుకొన్నాడు. అదే లారీలో ఆయన కూడ అలహాబాద్ కు చేరుకొన్నాడు. నాసిక్  నుండి వెయ్యి కిలోమీటర్ల దూరంలోని అలహాబాద్ కు మూడు రోజులు ప్రయాణించాడు.

అలహాబాద్ లో ఉల్లిగడ్డను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఎవరూ కూడ ముందుకు రాలేదు. దీంతో అలహాబాబాద్ నుండి ఆయన సమీపంలోని తన గ్రామానికి చేరుకొన్నాడు. ఇతర ప్రాంతాల నుండి వచ్చినందున తనకు కరోనా సోకిందా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకొనేందుకు గాను ఆయన కరోనా పరీక్షలు చేయించుకొన్నాడు. అతనికి కరోనా సోకలేదు. ఉల్లిపాయలు కొనుగోలు చేసేందుకు ఎవరైనా వస్తారా అని ఆయన ఆశగా ఎదురుచూస్తున్నాడు. తాను కొనుగోలు చేసిన ఉల్లికి మంచి డిమాండ్ వస్తోందని ఆయన భావిస్తున్నాడు.

click me!