దేశంలో కరోనా వైరస్ అదుపులోకి వస్తున్న సూచనలు కనిపించడం లేదు. రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. మరణాలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు 26 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.
న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ అదుపులోకి వస్తున్న సూచనలు కనిపించడం లేదు. రోజురోజుకీ కోవిడ్ -19 పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఆదివారం ఉదయానికి దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 26,496కు చేరుకుంది. మరణాల సంఖ్య 824కు చేరింది.
ఇప్పటి వరకు 5,803 మంది చికిత్స పొంది కోలుకున్నారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 19,868 ఉంది. జార్ఖండ్ లో తాజాగా ఏడు కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 66కు చేరుకుంది.
గత 24 గంటల్లో 1,990 కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఒక్క రోజులో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు రికార్డు కావడం ఇదే. మహారాష్ట్రలో 7628 కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 2096 కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో కేసుల సంఖ్య 1821 ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 1793 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 991 కేసులు రికార్డయ్యాయి. ఢిల్లీలో 2526 కేసులు నమోదయ్యాయి.
మహారాష్ట్రలో 323 మంది మరణిచారు. తమిళనాడులో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్ లో 27 మంది మరణించారు. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.