
ఉత్తరాఖండ్(Uttarakhand)లోని హరిద్వార్(Haridwar)లో గతేడాది ధరమ్ సంసద్ (dharam sansand) పేరిట ఏర్పాటు చేసుకున్న ఆధ్యాత్మిక సదస్సులో వక్తలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా వివాదాస్పదం అయ్యాయి. దీనిపై ప్రస్తుతం సుప్రీంకోర్టు (supreem court)లో కేసు నడుస్తోంది. అయితే ఈ విషయంలో తాజాగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (rss) చీఫ్ మోహన్ భగవత్ (mohan bhagavath) స్పందించారు. ఆ వ్యాఖ్యలు హిందుత్వానికి సంబంధం లేదని చెప్పారు.
నాగ్‌పూర్ (nagpur)లో ఓ వార్తాపత్రిక స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ‘హిందూత్వం, జాతీయ సమైక్యత’ పేరిట ఏర్పాటు చేసిన ఉపన్యాస కార్యక్రమంలో మోహన్ భగవత్ పాల్గొని మాట్లాడారు. ఇటీవల ‘ధరమ్ సంసద్’ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు హిందుత్వానికి అనుగుణంగా లేవని అన్నారు. అలాంటి అవమానకరమైన ప్రకటనలు హిందూ భావజాలానికి ప్రాతినిధ్యం వహించవని తెలిపారు. హరిద్వార్‌లో యతి నర్సింహానంద్ (yathi narsingarao), ఢిల్లీలో ‘హిందూ యువ వాహిని’ (hindu yuva vahini) చేసిన వ్యాఖ్యలు మైనారిటీ వర్గాలపై హింసను ప్రేరేపించాయని ఆరోపించారు. ‘‘ ధరం సంసద్ నుంచి వచ్చిన ప్రకటనలు హిందూ పదాలు, పని లేదా హృదయం కాదు, నేను కొన్నిసార్లు కోపంతో ఏదైనా మాట్లాడితే అది హిందుత్వ కాదు. ఆర్ఎస్ఎస్ లేదా హిందుత్వాన్ని అనుసరించే వారు దీనిని నమ్మరు’’ అని ఆయన చెప్పారు.
వ్యక్తిగత ప్రయోజనాలు లేదా శత్రుత్వాన్ని దృష్టిలో ఉంచుకుని చేసిన ప్రకటనలు హిందుత్వానికి
ప్రాతినిధ్యం వహించవని భగవత్ అన్నారు. ‘‘ ఆర్‌ఎస్‌ఎస్, హిందుత్వను అనుసరించే వారు ఈ తప్పుడు అర్థాన్ని విశ్వసించబోరు. సంతులనం, మనస్సాక్షి, అందరి పట్ల అనుబంధం హిందుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తాయి’’ అని ఆయన స్పష్టం చేశారు.
నాలుగు రోజుల క్రితం ఇదే విషయంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మరో నాయకుడు ఇంద్రేష్ కుమార్ (indresh kumar) కూడా స్పందించారు. ధర్మ సంసద్‌లో ముస్లిం సమాజంపై వ్యాఖ్యలు చేసిన వారిని చట్ట ప్రకారం ఎలాంటి మినహాయింపులు లేకుండా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. సమాజాన్ని మతోన్మాదంగా విభజించడం మానుకోవాలని ఆయన రాజకీయ నాయకులను కోరారు. సోదర భావంతో అభివృద్ధి చేసే రాజకీయాలు పాటించాలని సూచించారు.
ఏం జరిగిందంటే ?
2021 డిసెంబర్ 17 నుంచి 19 వరకు హరిద్వార్, ఢిల్లీలో ధరమ్ సంసద్ పేరిట ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో మత పెద్దలు విద్వేశపూరిత వ్యాఖ్యలు చేశారు. ముస్లింలపై యుద్దం ప్రకటించాలని అన్నారు. కత్తులు కాదు.. మరింత శక్తివంతమైన ఆయుధాలు చేతబట్టాలని పిలుపునిచ్చారు. ఆ వర్గాన్ని మొత్తం నిర్మూలించాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలూ చేశారు. 2029లో ఒక ముస్లిం ప్రధాన మంత్రి కాకుండా ఉండాలంటే యుద్ధానికి సిద్ధం కావాలనే తెలిపారు. ఈ ప్రసంగాలకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో వివాదాస్పదంగా మారాయి. దీంతో ఈ వ్యాఖ్యలు చేసిన యతి నర్సింగ్ రావును, ఇతర వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీం కోర్టులో విచారణలో ఉంది.
అలాగే గతేడాది డిసెంబరు 26వ తేదీన చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగిన మరో కార్యక్రమంలో హిందూ మత నాయకుడు కాళీచరణ్ మహారాజ్ (kali charan maharaj) మహాత్మా గాంధీపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు మైనారిటీలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేశారు. ఇవి కూడా వివాదం రేకెత్తించాయి.