
ICSE, ISC Results 2021-2022 released: దేశవ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ICSE 10వ తరగతి, ISC (12వ తరగతి) సెమిస్టర్ 1 పరీక్ష ఫలితాలను ది కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ (CISCE) విడుదల చేసింది. సోమవారం ఉదయం ఐసీఎస్ఈ 10వ తరగతి, ఐఎస్ఈ 12వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి
ICSE, ISC సెమిస్టర్ 1 పరీక్షల ఫలితాలను వెబ్ సైట్ లో అందుబాటులో పెట్టిన్నట్లు ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ (CISCE) వెల్లడించింది. ఫలితాలను cisce.org, results.cisce.org అనే వెబ్ సైట్లలో చూసుకోవచ్చని సూచించింది. అలాగే.. విద్యార్థులు SMS ద్వారా కూడా పరీక్ష ఫలితాలను పొందవచ్చు, ICSE/ISC(space)1234567(ఏడు అంకెల ID) అని టైప్ చేసి 09248082883కు సందేశాన్ని పంపించి.. ఫలితాలను పొందవచ్చు. ICSE (10 వ తరగతి) పరీక్షలు నవంబర్ 29 నుండి డిసెంబర్ 16 వరకు నిర్వహించబడ్డాయి, ISC పరీక్షలు నవంబర్ 22 నుండి డిసెంబర్ 20 వరకు నిర్వహించబడ్డాయి.