సీఏఏ అల్లర్లపై ఢిల్లీ పోలీసుల అనుబంధ ఛార్జీషీట్: చిదంబరం ఫైర్

By narsimha lodeFirst Published Sep 13, 2020, 6:28 PM IST
Highlights

ఢిల్లీ పోలీసుల తీరును మాజీ కేంద్ర మంత్రి చిదంబరం తప్పుబట్టారు. సీఏఏను నిరసిస్తూ ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో అనుబంధ ఛార్జీషీట్ల దాఖలులో సీపీఐఎం జాతీయ ప్రధాన కార్యదర్శి  సీతారాం ఏచూరి, స్వరాజ్ అభియాన్ కు చెందిన యోగేంద్ర యాదవ్ , పలువురు మేధావుల పేర్లను చేర్చడంపై ఆయన మండిపడ్డారు.
 

న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసుల తీరును మాజీ కేంద్ర మంత్రి చిదంబరం తప్పుబట్టారు. సీఏఏను నిరసిస్తూ ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో అనుబంధ ఛార్జీషీట్ల దాఖలులో సీపీఐఎం జాతీయ ప్రధాన కార్యదర్శి  సీతారాం ఏచూరి, స్వరాజ్ అభియాన్ కు చెందిన యోగేంద్ర యాదవ్ , పలువురు మేధావుల పేర్లను చేర్చడంపై ఆయన మండిపడ్డారు.

సమాచారం, ఛార్జీషీట్ మధ్య విచారణ, ధృవీకరణ వంటి కీలక అంశాలు ఉంటాయనే విషయాన్ని ఢిల్లీ పోలీసులు మర్చిపోయారా అని ఆయన ప్రశ్నించారు. ట్విట్టర్ వేదికగా చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీ అల్లర్ల కేసులో అనుబంధ ఛార్జీషీట్ లో సీతారాం ఏచూరితో పాటు పలువురు మేధావుల పేర్లను చేర్చడం ద్వారా న్యాయ వ్యవస్థను ఎగతాళి చేశారన్నారు.ఢిల్లీ అల్లర్లలో అనుబంధ ఛార్జీషీటులో పలువురు రాజకీయ నేతలు, ప్రముఖుల పేర్లను చేర్చడంపై  కాంగ్రెస్ మండిపడింది.ఈ విషయాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించనున్నట్టుగా కాంగ్రెస్ ప్రకటించింది. 

సీఏఏను నిరసిస్తూ ఈ ఏడాదిలో ఢిల్లీలో చోటు చేసుకొన్న అల్లర్లలో సుమారు 50 మందికి పైగా మరణించారు. అంతేకాదు పలువురు గాయపడ్డారు. 

click me!