హిందూ దేవతలపై అభ్యంతరకర వీడియో.. కేసు నమోదు, ఒకరి అరెస్టు

Published : Aug 05, 2023, 07:52 PM ISTUpdated : Aug 05, 2023, 07:53 PM IST
హిందూ దేవతలపై అభ్యంతరకర వీడియో.. కేసు నమోదు, ఒకరి అరెస్టు

సారాంశం

Chandigarh: హిందూ దేవతలపై అభ్యంతరకర వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన హర్యానాకు చెందిన ఒక‌ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. హిందూ దేవతలపై అభ్యంతరకరమైన వీడియోను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో షేర్ చేసినందుకు మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టాడనే ఆరోపణపై హర్యానా పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేసిన‌ట్టు తెలిపారు.  

objectionable video on Hindu deities: హిందూ దేవతలపై అభ్యంతరకర వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన హర్యానాకు చెందిన ఒక‌ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. హిందూ దేవతలపై అభ్యంతరకరమైన వీడియోను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో షేర్ చేసినందుకు మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టాడనే ఆరోపణపై హర్యానా పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేసిన‌ట్టు తెలిపారు.

వివ‌రాల్లోకెళ్తే.. సోషల్ మీడియా వేదికగా హిందూ దేవతలపై అభ్యంతరకర వీడియోను షేర్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన సాజిద్ పై మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టడం, సామాజిక సామరస్యానికి భంగం కలిగించడం, విద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన అభియోగాలు ఉన్నాయని పోలీసు అధికార ప్రతినిధి సుబే సింగ్ తెలిపారు. హ‌ర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలోని నిట్ ఫరీదాబాద్ ప్రాంతంలో గత మూడేళ్లుగా వీడియో షేర్ చేసిన వ్య‌క్తి సెలూన్ నడుపుతున్నాడు. ఫేస్ బుక్ లో షేర్ చేసిన వీడియోలో హిందూ దేవుళ్లపై అసభ్య పదజాలం ఉపయోగించారని పోలీసులు తెలిపారు.

నిందితుడు సాజిద్ తో పాటు మరో ఇద్దరిపై సరన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కోర్టులో హాజరుపరిచిన తర్వాత పోలీసు రిమాండ్ కు తీసుకెళ్తామనీ, మిగతా ఇద్దరు నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ లో సాజిద్ ను ఫరీదాబాద్ పోలీసులు అరెస్టు చేశారనీ, సామాజిక సామరస్యానికి విఘాతం కలిగించే ఎలాంటి ప్రకటనల గురించి అయినా పోలీసులకు తెలియజేయాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి సంఘ విద్రోహ శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు