కాంగ్రెస్ పార్టీలోనే రావణుడు దాగి ఉన్నాడు: ఖర్గే వ్యాఖ్యలపై విరుచుకపడ్డ హర్యానా హోం మంత్రి 

By Rajesh KarampooriFirst Published Nov 30, 2022, 5:10 PM IST
Highlights

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలను హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ తీవ్రంగా ఖండించారు.  ప్రధాని మోదీని రావణుడితో పోల్చడాన్ని తీవ్రంగా ఖండించారు. మల్లికార్జున్ ఖర్గేను టార్గెట్ చేస్తూ.. ఖర్గే ఇప్పటికీ రావణుడిని తన మదిలో దాచుకున్నారని సైటర్ వేశారు.  

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన అవమానకరమైన వ్యాఖ్యపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పై విరుచుకపడ్డారు. కాంగ్రెస్ లోనే  రావణుడు దాగి ఉన్నాడని అన్నారు. మంత్రి అనిల్ విజ్ ట్విట్టర్ వేదిక స్పందిస్తూ.. శ్రీరాముడు చాలా కాలం క్రితమే రావణుడిని చంపాడు. కానీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటనతో..  'రావణుడు'కాంగ్రెస్‌లోదాగి ఉన్నాడని తెలుస్తోందని విరుచుకపడ్డారు. అందుకే.. అతని (రావణ) ప్రభావాలు పార్టీలో ఎప్పటికప్పుడు కనిపిస్తాయని పేర్కొన్నారు. 

'జమ్మూ కాశ్మీర్‌ అభివ్రుద్దిని బీజేపీ అనుమతించదు' అని మెహబూబా ముఫ్తీ చేసిన ప్రకటనపై కూడా మంత్రి  విజ్ స్పందించారు. జమ్మూ కాశ్మీర్ ఇప్పటికే భారత్‌కు చెందిందని, అది భారత్‌కు మాత్రమే ఉంటుందని ఆయన అన్నారు. జవహర్ లాల్ నెహ్రూ తప్పిదం వల్ల కొంత కాలం ఆ ప్రాంతం మన నుంచి విడిపోయిందనీ,  ఇప్పుడు ఆ తప్పును దేశభక్త గల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆ తప్పిదాన్ని సరిదిద్దిదని అన్నారు. కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసిందనీ, తాజా దేశంలోని ఇతర రాష్ట్రాల తరహాలోనే కాశ్మీర్ కూడా ఏర్పడిందని అన్నారు. 

'మీ ఉదారవాదంతో దేశాన్ని పేదరికం చేస్తున్నారు'

ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై కూడా మంత్రి  విజ్ విరుచుకపడ్డారు. ‘గుజరాత్‌లో మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని లిఖితపూర్వకంగా ప్రకటిస్తున్నాను’ అని కేజ్రీవాల్‌ ప్రకటన చేశారు. దీనిపై హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ మాట్లాడుతూ.. లిఖితపూర్వకంగా ఇవ్వగలిగితే ఇవ్వండి.. అయితే ప్రభుత్వాన్ని బీజేపీయే ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఉచిత రేషన్, విద్యుత్ ఇవ్వడంపై విజ్ మాట్లాడుతూ.. స్వేచ్ఛావాదంతో దేశం పేదరికం అవుతోందని ప్రజలు ఇప్పుడు గ్రహించారని అన్నారు. ఇది కూడా కుట్రలో భాగమని అన్నారు.

గుజరాత్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. “ ప్రధాని మోడీ ముఖం గుజరాత్ లో జరిగే ప్రతి ఎన్నికలో కనిపిస్తుంది. అవి.. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీ ఎన్నికల్లో ప్రతి చోట తనకే ఓటు వేయాలని అంటున్నారు. ప్రధాని మోదీ గురించి మాట్లాడుతుంటారు. ప్రధాని మోడీకి రావణుడిలా 100 ముఖాలు ఉన్నాయా?" అని ఖర్గే సంచలన ప్రకటన చేశారు.  

ఖర్గే వ్యాఖ్య చేసిన వెంటనే బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా స్పందించారు. ఖర్గే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ అగ్రనేతలు ప్రధాని మోదీని పదే పదే అవమానిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీని రావణుడు అని పిలవడం ప్రతి గుజరాతీ పౌరుడిని  ఘోర అవమానమేననీ, దేశాన్ని కూడ అవమానమేనని అన్నారు. ఈ వ్యాఖ్యల్లో కాంగ్రెస్ మనస్తత్వం ప్రతిబింబిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

click me!