ఆవు పేడ తిన్న హర్యానా డాక్టర్.. తనువు, మనస్సు పవిత్రమవుతుందని వ్యాఖ్యలు.. వైరల్ వీడియో ఇదే

By telugu teamFirst Published Nov 18, 2021, 6:12 PM IST
Highlights

హర్యానాకు చెందిన ఓ డాక్టర్ ఆవు పేడ తింటున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. ఆవు పేడు చాలా సాధారణంగా నోట్లో వేసుకుని దాని లాభాలను వివరిస్తున్న వైనం చాలా మందిని ఇబ్బందిలోకి నెట్టింది. ఆ వీడియోలో ఆ డాక్టర్ చెప్పిన విషయాలను కొందరు సమర్థిస్తుండగా మెజార్టీ ప్రజలు తప్పుపట్టారు. ఇంకొందరు ఆ వీడియోపై జోకులు వేశారు.
 

న్యూఢిల్లీ: ఇప్పటికీ చాలా మంది ఆవు పేడ(Cow Dung), గోమూత్రానికి(Cow Urine) అనేక రోగాలను నివారించే శక్తి ఉన్నదని విశ్వసిస్తున్నారు. కానీ, సైన్స్(Science) మాత్రం ఇందుకు విరుద్ధమైన వాదన చెబుతున్నది. ఈ శాస్త్ర విజ్ఞాన విషయాలను పక్కన పెడితే.. ఓ Haryana డాక్టర్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయింది. ఏ మాత్రం సంకోచం లేకుండా చాలా సాధారణంగా ఆవు పేడను తినడం అందరినీ షాక్‌కు గురి చేస్తున్నది. ఆవు పేడను నములుతూ దాని విలువలను వివరిస్తున్న ఆ వీడియోపై Social Mediaలో నెటిజన్లు తలా ఒక మాట అంటున్నారు. కొందరు ఆయన వ్యాఖ్యలను సమర్థించారు. చాలా మంది జోకులు పేల్చగా, ఇంకొందరు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

ఆ వ్యక్తిని మనోజ్ మిట్టల్‌గా గుర్తించారు. ఆయన ఎంబీబీఎస్, ఎండీ చదివినట్టు ఆయన ట్విట్టర్ బయో వెల్లడిస్తున్నది. హర్యానాలోని కర్నాల్‌లో ఆయన పిడియాట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. అంటే చిన్న పిల్లల వైద్యుడిగా సేవలు అందిస్తున్నాడు. ఆ వైరల్ వీడియోలో ఆయన ఓ గోశాలలో కనిపించాడు. పంచగవ్య.. ఆవు నుంచి పొందే ఐదు రకాల పదార్థాల గురించి ఆయన మాట్లాడాడు. అలా మాట్లాడుతూనే కిందికి వంగి భూమి పై నుంచి ఆవు పేడను తీసుకుని నోట్లో వేసుకున్నాడు. తన తల్లి ఉపవాసాలు చేసే సమయంలో ఆవు పేడను తినేదని వివరించాడు. 

Guys........sorry 😭😭😭 pic.twitter.com/ayf6ymHgJJ

— Tempest (@ColdCigar)

Also Read: హనుమంతుడి కాళ్లు మొక్కి.. ముందున్న హుండీ కొట్టేసిన దొంగ.. వైరల్ అవుతున్న వీడియో ఇదే

అంతేకాదు, గోమూత్రం, ఆవు పేడ తింటే చాలా వరకు సీరియస్ వ్యాధులను నివారించ గలమని ఆ డాక్టర్ మనోజ్ మిట్టల్ వివరించాడు. అంతేకాదు, మహిళలు ఆవు పేడ తింటే నార్మల్ డెలివరీ అవుతుందని, ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడదని తెలిపాడు. అంతేకాదు, ఆవు నుంచి వచ్చే ఐదు పదార్థాలు మానవాళికి ఎంతో విలువైనవని చెప్పాడు. ఒక వేళ మనం ఆవు పేడ తింటే మన దేహం, మనస్సు స్వచ్ఛమవుతుందని అన్నాడు. ఆత్మ పవిత్రతను సంతరించుకుంటుందని తెలిపాడు. ఒక్క సారి ఆవు పేడ దేహంలోకి వెళ్లగానే అది బాడీ అంతా క్లీన్ చేస్తుందని చెప్పాడు.

Also Read: ముఖ్యమంత్రికే కొరడా దెబ్బలు.. వీడియో ఇదే.. ఎందుకో తెలుసా?

ఈ వీడియోను హర్యానాకు చెందిన ఓ మీడియా సంస్థ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అప్పటి నుంచి ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. చాలా మంది ఈ వీడియోపై జోకులు పేల్చారు. కాగా, కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ యూజర్ అయితే ఏకంా ఆ డాక్టర్ పొందిన డిగ్రీలను ప్రశ్నించాడు. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఈ మనిషి తీరును దృష్టిలోకి తీసుకోవాలని కోరాడు. మెడికల్ ప్రాక్టీస్‌కు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని చెప్పాడు. ఒక పీడియాట్రిషియన్‌గా ఆయన అమాయకమైన చిన్న పిల్లలకు పేడను ప్రిస్క్రిప్షన్‌గా ఇవ్వకూడదు గదా అంటూ ఆందోళన వ్యక్తం చేశాడు.

click me!