
హర్యానా ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. అవివాహితుల కోసం మనోహర్ లాల్ ఖట్టార్ ప్రభుత్వం పెన్షన్ స్కీమ్‌ను ప్రకటించింది. పెళ్లి కాని ఆడవాళ్లకు, మగవాళ్లకు ప్రతి నెలా రూ.2,750 ఇవ్వనున్నట్లు వెల్లడించింది. అలాగే.. భార్య చనిపోయి, భర్త చనిపోయి వితంతువుగా బతుకుతున్న వారిని కూడా ముఖ్యమంత్రి ఈ పింఛను పరిధిలోకి తీసుకోచ్చారు. హర్యానాలో ఒంటరిగా ఉన్నవారికి ప్రతి నెలా పెన్షన్ అందిస్తామని సీఎం మనోహర్ లాల్ ప్రకటించారు.
ఈ పెన్షన్ ఎవరికి వస్తుంది?
ముఖ్యమంత్రి మనోహర్ లాల్ అవివాహిత పెన్షన్‌కు సంబంధించి షరతులను మీడియాకు వెల్లడించారు. హర్యానాలోని 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల అవివాహిత పురుషులు , మహిళలకు ఇక నుండి నెలవారీ పెన్షన్ ₹ 2,750 ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అయితే అవివాహిత పెన్షన్ అందుకునేవారి వార్షిక ఆదాయం రూ.1.80 లక్షల కంటే తక్కువ ఉండాలని సీఎం వెల్లడించారు. వితంతువులకు కూడా పెన్షన్‌ను ప్రకటించారు. వారి కూడా ప్రతినెలా రూ.2750 ఇవ్వనున్నారు. అయితే వాళ్ల వార్షిక ఆదాయం 3 లక్షల లోపు ఉండాలని కండీషన్ పెట్టారు.