బాలికను వేధించొద్దన్నందుకు బాక్సర్ ను కత్తితో పొడిచి..

Published : Jun 09, 2021, 09:31 AM IST
బాలికను వేధించొద్దన్నందుకు బాక్సర్ ను కత్తితో పొడిచి..

సారాంశం

చంఢీగర్ లో దారుణం జరిగింది. హర్యానాలోని రోహ్ తక్ లో ఓ బాక్సర్ కత్తిపోట్లతో మరణించాడు. పన్నెండేళ్ల చిన్నారిని వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిని ఆపడానికి వెడితే ఈ దారుణం జరిగింది. హర్యానాలోని రోహ్‌తక్‌లోని రెసిడెన్షియల్ కాలనీలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుంది.  

కామేష్ అనే 24యేళ్ల వ్యక్తికి బాక్సర్ గా మంచి పేరుంది. మోడలింగ్, యాక్టింగ్ లో కూడా మంచిపేరు తెచ్చుకుంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి తేజ్ కాలనీలోని బంధువుల ఇంటికి వెడుతుండగా.. ఈ ఘటన జరిగింది. 

మార్గమధ్యలో ఓ యువకుడు 12యేళ్ల బాలికను వేధించడం గమనించి.. అపడానికి వెళ్లాడు. ఎందుకలా వేధిస్తున్నావ్ అంటూ నిలదీయగా నిందితుడు హఠాత్తుగా కత్తి తీసి కామేష్ మీద దాడికి దిగాడు. 

‘ఒకసారి కాదు విచక్షణా రహితంగా అనేకసార్లు కామేష్ ను పొడవడంతో.. కామేష్ అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే కామేష్ ను పిజిఐఎంఎస్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మరణించాడు’ అని గోరఖ్‌పాల్ డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ రోహ్‌తక్ తెలిపారు.

దీనిమీద కేసు నమోదు చేశామని, తదుపరి దర్యాప్తు జరుగుతోందని డీఎస్పీ తెలిపారు.
 
PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌