ఉగ్రస్థావర కూల్చివేత.. భారీ మొత్తంలో ఆయుధాలు స్వాధీనం

By Rajesh KarampooriFirst Published Dec 5, 2022, 2:31 AM IST
Highlights

జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో భద్రతా బలగాలు ఘనవిజయం సాధించాయి. ఉగ్రవాదుల స్థావరాన్ని భద్రతా బలగాలు ఛేదించి.. భారీ మొత్తంలో మందుగుండు సామాగ్రిని, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. రిమోట్ మార్వాలోని సర్కుండు-నవ్‌పాచి ప్రాంతంలో సైన్యం , పోలీసులు సంయుక్తంగా జరిపిన సెర్చ్ ఆపరేషన్‌లో రహస్య స్థావరం ఛేదించబడిందని రక్షణ ప్రతినిధి తెలిపారు.

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద నిర్మూలనలో నిమగ్నమైన భద్రతా దళాలు ఘనవిజయం సాధించాయి. కిష్త్వార్‌లో ఉగ్రవాదుల స్థావరాన్ని ఛేదించి భారీ మొత్తంలో మందుగుండు సామాగ్రిని, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. . ఈ రహస్య స్థావరం గురించి భద్రతా బలగాలకు సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఈ ఉగ్రవాద స్థావరాన్ని కూల్చివేయడం వల్ల ఉగ్రవాద సంస్థకు పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని భద్రతా బలగాలు పేర్కొన్నాయి.

జమ్మూలోని రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ దేవేంద్ర ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం..  కిష్త్వార్ జిల్లాలోని నవపాచి ప్రాంతంలో ఉగ్రవాదుల స్థావరాన్ని కూల్చివేయడం ద్వారా భారత సైన్యం , జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. జమ్మూ. ఇంటెలిజెన్స్ అందించిన సమాచారం ప్రకారం.. సైన్యం,జమ్మూ కాశ్మీర్ పోలీసులు కిష్త్వార్ జిల్లాలోని సర్కుండి ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారని ఆయన పేర్కొన్నారు.

పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం 

ఈ ఆపరేషన్ సమయంలో భారీ మొత్తంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి. స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో రెండు గ్రెనేడ్లు, రెండు ఎకె-47 మ్యాగజైన్లు, 109 రౌండ్ల ఎకె-47, 56 రౌండ్ల పికా, ఒక మ్యాగజైన్ .303 రైఫిల్, 27 రౌండ్ల బులెట్లు, 303 రైఫిల్‌కు చెందిన ఒక మ్యాగజైన్‌, డిటోనేటర్, సేఫ్టీ ఫ్యూజ్ ను స్వాధీనం చేసుకున్నట్లు డిఫెన్స్ ప్రతినిధి తెలిపారు.

ఉగ్రవాదుల నీచ ఆకృతులకు ఎదురుదెబ్బ

ఉగ్రవాద స్థావరం కూల్చివేత అనేది ఆ పాంత్రంలో తమ ఉనికిని చాటుకోవాలనుకున్న ఉగ్రవాదులకు పెద్ద దెబ్బ అని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి పేర్కొన్నారు. సున్నితమైన నవపాచి ప్రాంతంలో పెద్ద మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం ఉగ్రవాదుల దుర్మార్గపు ఆకృతులకు పెద్ద దెబ్బ తగిలిందని భారత ఆర్మీ PRO అన్నారు.

click me!