పోర్న్‌వీడియో చూస్తుండగా....షాక్, అది తన భార్యే

Siva Kodati |  
Published : Jul 10, 2019, 10:03 AM IST
పోర్న్‌వీడియో చూస్తుండగా....షాక్, అది తన భార్యే

సారాంశం

గుజరాత్‌లో దారుణం జరిగింది. స్మార్ట్‌టీవీకి కెమెరాను హ్యాక్ చేసిన ఆగంతకుడు దంపతుల శృంగార దృశ్యాలను చిత్రీకరించి పోర్న్‌సైట్‌లో అప్‌లోడ్ చేశాడు.

గుజరాత్‌లో దారుణం జరిగింది. స్మార్ట్‌టీవీకి కెమెరాను హ్యాక్ చేసిన ఆగంతకుడు దంపతుల శృంగార దృశ్యాలను చిత్రీకరించి పోర్న్‌సైట్‌లో అప్‌లోడ్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. ఒక రోజులో ఒక వ్యక్తికి ప్రతిరోజు రాత్రి తన భార్యతో కలిసి బెడ్‌‌రూమ్‌లో ఉన్న స్మార్ట్‌ టీవీలో నీలిచిత్రాలు చూడటం అలవాటు.

అలా చూస్తుండగా.. ఒక వెబ్‌సైట్‌లో కనిపించిన వీడియో చూసి అతడికి దిమ్మతిరిగి మైండ్‌ బ్లాక్ అయిపోయింది.. కారణం అతడు తన భార్యతో.. శృంగారంలో పాల్గొంటున్న వీడియో.

అయితే దానిని ఎవరు .. ఎలా తీశారో..? ఎప్పుడు తీశారో అతడికి అర్ధం కాలేదు. బెడ్‌రూమ్‌లో ఎవరైనా రహాస్యంగా కెమెరాలు పెట్టారేమోనని గదంతా గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయలేక అతడు సైబర్ సెక్యూరిటీ నిపుణులను సంప్రదించాడు.

వారు అతడి గదిని గాలిస్తుండగా.. వారి దృష్టి స్మార్ట్‌టీవీపై పడింది. ఆ టీవీలో ఇన్‌బిల్ట్ కెమెరా ఉన్న విషయాన్ని గుర్తించారు. దీని ఆధారంగా వాళ్లు చిక్కుముడి విప్పారు. ఆ స్మార్ట్‌టీవీ రోజంతా వైఫైకి కనెక్టయి ఉండటంతో.. ఆన్‌లైన్‌లో గుర్తు తెలియని వ్యక్తి దానిని హ్యాక్ చేసినట్లు నిపుణులు గుర్తించారు.

ఆ టీవీలో ఉన్న కెమెరాను ఆన్‌చేసి రాజేశ్ దంపతుల శృంగార దృశ్యాలను రహస్యంగా చిత్రీకరించాడు. ఆ వీడియోను అదే టీవీ ద్వారా.. వాళ్లింట్లో ఉన్న వైఫై నెట్‌వర్క్ ద్వారా.. పోర్న్‌సైట్‌లోకి అప్‌లోడ్ చేశాడు.

ఇదంతా రాజేశ్‌కు.. అతడి భార్యకే ఏమాత్రం తెలియకపోవడం గమనార్హం. అంతా తెలుసుకున్న రాజేశ్‌ సదరు పోర్న్‌సైట్‌లో ఉన్న తన వీడియోను సైబర్ భద్రత నిపుణుల సాయంతో తొలగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.     
 

PREV
click me!

Recommended Stories

ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?
పౌర విమానయాన శాఖపై సభ్యుల ప్రశ్నలు | Minister Ram Mohan Naidu Strong Reply | Asianet News Telugu