జిమ్ ట్రైనర్ లైంగిక వేధింపులు..తన కోరిక తీర్చకుంటే.. ఆ వీడియోలు లీక్ చేస్తానని బ్లాక్ మెయిల్..

Published : Jul 31, 2023, 05:32 AM ISTUpdated : Jul 31, 2023, 06:59 AM IST
జిమ్ ట్రైనర్ లైంగిక వేధింపులు..తన కోరిక తీర్చకుంటే.. ఆ వీడియోలు లీక్ చేస్తానని బ్లాక్ మెయిల్..

సారాంశం

జిమ్ లో పరిచయమైన ఓ మహిళతో స్నేహంగా ఉండి.. చనువుగా మెదిలాడు ఓ ట్రైనర్. ఈ క్రమంలో కొన్నిసార్లు వీడియో కాల్స్ మాట్లాడాడు. తన కోరిక తీర్చకుంటే..వాటిని లీక్ చేస్తానని  బ్లాక్ మెయిల్ చేస్తూ.. లైంగికంగా వేధింపులకు గురి చేశాడు.  

నేటీ సమాజంలో మహిళలు, చిన్నారులకు రక్షణ లేకుండా పోతున్నది. ఇంటా, బయట అనే తేడా లేకుండా..  నిత్యం ఏదో ఒకచోట వారు వేధింపులు ఎదురవుతూనే ఉన్నారు. కఠినతర చట్టాలు అమల్లో ఉన్నా.. మహిళలపై నేరాలు మాత్రం తగ్గడం లేదు. ఐతే కొందరు వేధింపులకు గురైనా చట్టాలు తెలియకపోవడం.. మరికొందరూ పరువు పోతుందని ఆలోచించి ఫిర్యాదులు చేయకుండా మిన్నకుండిపోతున్నారు. ఇలాంటి పరిస్థితే మృగాళ్లకు ఆయుధంగా మారుతోంది.

తాజాగా  ఓ జిమ్ ట్రైనర్ మహిళను వేధింపులకు గురించి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేస్తానని బెదిరించి డబ్బు వసూలు చేసేందుకు ప్రయత్నించిన 38 ఏళ్ల జిమ్ ట్రైనర్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అసభ్యకరమైన వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేస్తానని బెదిరించి నిందితుడు మహిళ నుండి రూ. 70,000 తీసుకున్నాడు. ఆమె పోలీసులను ఆశ్రయించాలని నిర్ణయించుకున్నప్పుడు మరింత డబ్బు వసూలు చేయడానికి ప్రయత్నించాడు. అత్యాచారం, వసూళ్ల ఆరోపణలపై నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

బాధితురాలు దక్షిణ ముంబైకి చెందిన జిమ్‌కు వెళ్లిందని, అక్కడి జిమ్ ట్రైనర్ తో ఆమెకు పరిచయం ఏర్పడిందనీ, ఈ తరుణంలో వాట్సాప్‌లో క్రమం తప్పకుండా మాట్లాడేవారు. నిందితుడు మహిళకు పలుమార్లు వీడియో కాల్స్ చేశాడు. ఆ తర్వాత వీడియో కాల్స్ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని మహిళను బెదిరించడం మొదలుపెట్టాడు. ఫిర్యాదుదారుడి నుంచి డబ్బులు కూడా డిమాండ్ చేయడం ప్రారంభించాడు.

మొదట్లో పరువుకు భయపడిన మహిళ నిందితులకు రూ.70వేలు చెల్లించింది. అయితే, నిందితులు ఆమెను మరింత డబ్బు డిమాండ్ చేయడం ప్రారంభించారు. ఆ తరువాత తన లైంగిక వాంఛ తీర్చాలని డిమాండ్ చేశారు. లేదంటే.. వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బెదిరించాడు.

దీంతో దిగ్గుతోచని మహిళ స్థానిక పోలీసులను ఆశ్రయించింది. నిందితుడికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలించి  శనివారం రాత్రి అరెస్టు చేశారు. నిందితుడు సదరు మహిళను నెల రోజులుగా వేధింపులకు గురి చేస్తున్నాడని, లేదంటే తన పర్సనల్ వీడియోను నెట్టింట్లో పెడుతానని బెదిరింపులకు గురి చేశాడని పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !