Gyanvapi case: జ్ఞాన‌వాపి మ‌సీదు కేసులో ఊహించ‌ని ప‌రిణామం.. ముస్లింల త‌రుపు న్యాయ‌వాది గుండెపోటుతో మృతి..

Published : Aug 01, 2022, 11:29 AM ISTUpdated : Aug 01, 2022, 11:31 AM IST
Gyanvapi case: జ్ఞాన‌వాపి మ‌సీదు కేసులో ఊహించ‌ని ప‌రిణామం.. ముస్లింల త‌రుపు న్యాయ‌వాది గుండెపోటుతో మృతి..

సారాంశం

Gyanvapi case:  జ్ఞాన‌వాపి మ‌సీదు వివాదం కేసులో అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ తరపున వాదిస్తున్న సీనియ‌ర్ లాయ‌ర్ అభయ్ నాథ్ గుండెపోటు రావడంతో మ‌రణించారు.  

Gyanvapi case:  జ్ఞాన్‌వాపి కేసు (Gyanvapi case)లో అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది అభయ్ నాథ్ యాదవ్ గుండెపోటుతో మరణించారు. అభయ్ నాథ్ కు ఆదివారం రాత్రి గుండెపోటు రావ‌డంతో ఆయ‌నను వెంట‌నే వారణాసిలోని మక్బూల్ ఆలం రోడ్‌లోని ఓ ప్ర‌వేట్ ఆసుపత్రిలో చేరారు. కానీ.. ఆయ‌నను ప‌రీక్షించిన వైద్యులు మార్గ‌మ‌ధ్యంలోనే చ‌నిపోయినట్టు ప్ర‌క‌టించారు.  

బనారస్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది నిత్యానంద రాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి 10:30 గంటల సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో హుటాహుటిన వారణాసిలోని త్రిమూర్తి ఆసుపత్రికి త‌ర‌లించ‌గా..  అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆ తర్వాత కుటుంబసభ్యులు అత‌డిని శుభమ్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
 
శృంగార్ గౌరీ - జ్ఞాన్వాపి కేసులలో అభయ్ నాథ్ యాదవ్ ఆగస్టు 4న ముస్లిం వైపు నుండి ప్రత్యుత్తరం సమర్పించవలసి ఉండగా, ఆకస్మికంగా న్యాయవాది మరణించారు. ఈ కేసులో న్యాయవాది అభయ్ నాథ్ యాదవ్ పాత్ర ముఖ్యమైనది. 

జ్ఞాన్వాపి కేసును లోయర్ కోర్టు విచారిస్తున్న నేపథ్యంలో దీనిపై అక్టోబరులో సుప్రీంకోర్టు విచారణ జరపాల‌ని నిర్ణ‌యించింది. ప్రస్తుతం దిగువ కోర్టులో విచారణ జరుగుతోందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ నరసింహలతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ జరుపుతోంది. సీనియర్ న్యాయవాది ఆక‌స్మిక మరణించడంపై బనారస్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నిత్యానందరాయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?