భర్తను, అత్తను చంపేసి ముక్కలుగా నరికిన మహిళ.. 7 నెలల తర్వాత వెలుగులోకి.. అసలేం జరిగిందంటే..

Published : Feb 21, 2023, 09:28 AM IST
భర్తను, అత్తను చంపేసి ముక్కలుగా నరికిన మహిళ.. 7 నెలల తర్వాత వెలుగులోకి.. అసలేం జరిగిందంటే..

సారాంశం

దేశంలో ఇటీవల వెలుగుచూస్తున్న నేరాలు తీవ్ర భయాందోళన నెలకొల్పుతున్నాయి. దేశ రాజధానిలో ఢిల్లీలో చోటుచేసుకున్న శ్రద్దా  వాకర్, నిక్కీ యాదవ్ హత్య కేసుల తరహాలో అస్సాంలో మరో షాకింగ్‌ ఘటన వెలుగుచూసింది. 

దేశంలో ఇటీవల వెలుగుచూస్తున్న నేరాలు తీవ్ర భయాందోళన నెలకొల్పుతున్నాయి. దేశ రాజధానిలో ఢిల్లీలో చోటుచేసుకున్న శ్రద్దా  వాకర్, నిక్కీ యాదవ్ హత్య కేసుల తరహాలో అస్సాంలో మరో షాకింగ్‌ ఘటన వెలుగుచూసింది. అస్సాంలోని గౌహతికి సమీపంలోని నూన్‌మతికి చెందిన ఒక మహిళ తన భర్త, అత్తను దారుణంగా హత్య చేసి.. వారి శరీర భాగాలను కొన్ని రోజులు ఫ్రీజర్‌లో భద్రపరిచి, తరువాత నదిలో పారవేసింది. అయితే ఈ దారుణానికి మహిళకు ఆమె ప్రియుడు, అతడి స్నేహితుడు సహకరించాడు. వివాహేతర సంబంధమే ఈ దారుణానికి ముఖ్య కారణంగా తేలింది. ఈ కేసుకు సంబంధించి మొత్తం ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

వివరాలు.. దాదాపు ఏడు నెలల క్రితం వందనా కలిత అనే మహిళ తన భర్త అమరేంద్ర డే, అత్త శంకరి డే కనిపించడం లేదని పోలీసులుకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. దర్యాప్తు వారి ఆచూకీకి సంబంధించి ఎటువంటి ఆధారాలను గుర్తించలేకపోయారు అయితే  కొంతకాలం  తర్వాత అమరేంద్ర  బంధువు మరొక మిస్సింగ్ ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు అమరేంద్ర భార్య వందనపై అనుమానం తలెత్తింది. దీంతో పోలీసులు ఈ కేసు విచారణను తిరిగి ప్రారంభించారు. ఈ క్రమంలోనే పోలీసులు అమరేంద్ర, శంకరిలు హత్యకు గురైనట్టుగా కనుగొన్నారు. 


వందన, ఆమె ప్రేమికుడు, అతడి స్నేహితుడు ఈ హత్యలు చేసినట్టుగా  పోలీసులు గుర్తించారు. అమరేంద్ర, శంకరిలను హత్య చేసిన అనంతరం.. వారిని మృతదేహాలను ముక్కలుగా నరికారు. అనంతరం శరీర భాగాలను ఉంచి ఫ్రిజ్‌లో భద్రపరిచారు. మూడు రోజుల తర్వాత వారి శరీర భాగాలను పాలిథిన్ కవర్లలో ఉంచి గౌహతి నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేఘాలయలోని చిరపుంజికి తీసుకెళ్లారు. అక్కడ ఎత్తైన కొండ నుంచి వాటిని కిందకు విసిరేశారు. 

అయితే ఈ కేసును చేధించిన పోలీసులు ఆదివారం మేఘాలయలో మృతదేహాలను గుర్తించి.. కొన్ని శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్పారు. చనిపోయిన ఇద్దరి మృతదేహాలు లేదా అన్ని శరీర భాగాలను కనుగొనడానికి తమ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్టుగా చెప్పారు. తదుపరి విచారణ కొనసాగుతుందని వెల్లడించారు.

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !