
న్యూఢిల్లీ: రాజ్యసభలో సభా కార్యక్రమాలకు పదే పదే అంతరాయం కల్గించిన 12 మంది విపక్ష పార్టీ ఎంపీలపై విచారణ జరిపించాలని రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధంకర్ పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీని కోరారు.
పార్లమెంట్ బడ్జెట్ ఇటీవల ముగిశాయి. ఈ బడ్జెట్ సమావేశాల సమయంలో రాజ్యసభలో విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు పదే పదే సభా కార్యక్రమాలకు అంతరాయం కల్గించారు. ఈ విషయమై పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీని విచారణ చేయాలని ఆదేశించారు రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధంకర్.12 మంది విపక్ష పార్టీలకు చెందిన ఎంపీల్లో తొమ్మిది మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలున్నారు. మిగిలినవారిలో ఆప్ సభ్యులు.
పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీకి సిఫారసు చేసిన వారిలో శక్తి సిన్హా, నార్ బాయ్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, కుమార్ కేత్కర్, ప్రతాప్ గర్హి, ఎల్, హనుమంతయ్య, పూలో దేవి నేతమ్, మాథర్ హిషామ్ , రంజిత్ రంజన్ లు కాంగ్రెస్ పార్టీ సభ్యులు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సంజయ్ సింగ్ , సుశీల్ కుమార్ గుప్తా, సందీప్ కుమార్ పాఠక్ లున్నారు.
సభా సంప్రదాయాలను తాము ఉల్లంఘించలేదని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ చెప్పారు. వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకువచ్చామన్నారు. ఈ విషయమై తమకు నోటీసు వచ్చిన సమయంలో స్పందిస్తామని ఆయన చెప్పారు.
రాజ్యసభలో సభా కార్యక్రమాలకు పదే పదే అంతరాయం కల్గించారని 12 మంది విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలపై విచారణకు రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధంకర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటేరియట్ ఈ నెల 18వ తేదీన ప్రకటించింది.