ఢిల్లీలో 500 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత: అట్టుడుతుకుతున్న పంజాబ్

By Siva KodatiFirst Published Aug 13, 2019, 11:29 AM IST
Highlights

ఢిల్లీలోని 500 సంవత్సరాల నాటి ప్రఖ్యాత శ్రీ గురు రవిదాస్ ఆలయం, సమాధి కూల్చేవేయడంతో పంజాబ్‌లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఆలయం కూల్చివేతకు నిరసనగా జలంధర్‌లో అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి

ఢిల్లీలోని 500 సంవత్సరాల నాటి ప్రఖ్యాత శ్రీ గురు రవిదాస్ ఆలయం, సమాధి కూల్చేవేయడంతో పంజాబ్‌లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఆలయం కూల్చివేతకు నిరసనగా జలంధర్‌లో అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి.

పరిస్థితి తీవ్రత దృష్ట్యా శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. గురు దాస్ రవిదాస్ ఆలయ కూల్చివేతపై తమ అసంతృప్తిని వెల్లడించగా.. సమస్య పరిష్కారానికి చొరవ చూపుతామని ఆయన హామీ ఇచ్చారని బాదల్ ట్వీట్ చేశారు.

చారిత్రక ఆలయ కూల్చేవేతను తీవ్రంగా ఖండిస్తున్నామని బాదల్ పేర్కొన్నారు. పార్టీ ప్రతినిధి బృందం త్వరలో హోంమంత్రి అమిత్ షాను కలిసి ఈ వ్యవహారం తీవ్రతను ఆయన దృష్టికి తీసుకువెళతామని బాదల్ స్పష్టం చేశారు. 

click me!