డీఎంకే నేతపై కాల్పులు: ఆంధ్రా- తమిళనాడు బోర్డర్‌లో టెన్షన్

Siva Kodati |  
Published : Oct 17, 2020, 02:17 PM IST
డీఎంకే నేతపై కాల్పులు: ఆంధ్రా- తమిళనాడు బోర్డర్‌లో టెన్షన్

సారాంశం

చిత్తూరు జిల్లా కుప్పంకు సమీపంలోని తమిళనాడు సరిహద్దుల్లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. డీఎంకే నేత వేలాయుధంపై గుర్తు తెలియని దుండుగులు నాటు తుపాకీలతో కాల్పులు జరిపారు.

చిత్తూరు జిల్లా కుప్పంకు సమీపంలోని తమిళనాడు సరిహద్దుల్లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. డీఎంకే నేత వేలాయుధంపై గుర్తు తెలియని దుండుగులు నాటు తుపాకీలతో కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, అనుచరులు ఆయనను వాణీయంబడి ఆసుపత్రికి తరలించారు.

కుప్పం సమీపంలోని తమిళనాడు రాష్ట్రం నారాయణపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పుల తర్వాత నిందితులు కుప్పం వైపుకు పరారైనట్లు గుర్తించారు. రంగంలోకి దిగిన తమిళనాడు వాణీయంబడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?