ఘోర రోడ్డుప్రమాదం..9మంది మృతి,30మందికి గాయాలు

Published : Oct 17, 2020, 01:30 PM IST
ఘోర రోడ్డుప్రమాదం..9మంది మృతి,30మందికి గాయాలు

సారాంశం

ఈ రెండు  వాహనాల్లో మొత్తం కలిపి 39మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా.. వీరిలో 9మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. మిగిలిన 30మందికి తీవ్రగాయాలయ్యాయి.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫిలిబిత్ జిల్లా శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా మరో 30 మంది ప్రాణాలు కోల్పోయారు.  పురాన్ పూర్ వద్ద బొలేరో వాహనాన్ని ఓ మినీ బస్సు ఢీ కొట్టింది. ఎదురెదురుగా వచ్చిన రెండు వాహనాలు ఢీ కొట్టుకోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ రెండు  వాహనాల్లో మొత్తం కలిపి 39మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా.. వీరిలో 9మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. మిగిలిన 30మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

క్షతగాత్రులను చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించిన పోలీసులు.. కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. అతివేగం, నిద్రమత్తు ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. మృతులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే Udayanidhi Stalin విడుదల | Udhayanidhi Stalin Released Within Hours
Udhayanidhi Stalin Speech Controversy: తమిళ రాజకీయాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్ ల రచ్చ | Asianet Telugu