భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌పై కాల్పులు

Siva Kodati |  
Published : Jun 28, 2023, 06:15 PM ISTUpdated : Jun 28, 2023, 06:22 PM IST
భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌పై కాల్పులు

సారాంశం

భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌పై బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. 

భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌పై బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. ఘటన సమయంలో ఆజాద్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాడి చేసిన వ్యక్తులు హర్యానా రవాణా శాఖ నెంబర్ ప్లేట్ వున్న కారులో ఘటనాస్థలికి చేరుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 

కాల్పులు జరిగిన  సమయంలో ఆజాద్ టయోటా ఫార్చ్యూనర్‌ కారులో ప్రయాణిస్తున్నారు. వాహనం సీటు , డోర్‌పై బుల్లెట్ గుర్తులు వున్నాయి. దుండగులు వెనుక నుంచి కారు వద్దకు వచ్చి చంద్రశేఖర్ ఆజాద్‌పై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ‌కు గంట‌లో వెళ్లిపోవ‌చ్చు.. దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్‌లో మ‌రో కీల‌క అడుగు
విజయ సంకల్ప యాత్రలో మోదీ స్పీచ్ కి దద్దరిల్లిన సభ | PM Narendra Modi Speech | Asianet News Telugu