భర్తని కాదని మరో వ్యక్తితో లేచిపోయిందని.. నగ్నంగా..

Published : Jul 15, 2021, 11:14 AM ISTUpdated : Jul 15, 2021, 11:18 AM IST
భర్తని కాదని మరో వ్యక్తితో లేచిపోయిందని.. నగ్నంగా..

సారాంశం

ఈ విషయం భర్త, అతని కుటుంబసభ్యులకు తెలియడంతో... వెంటనే లేచిపోయిన జంట ఎక్కడ ఉందో కనుక్కున్నారు.

ఆమెకు అప్పటికే వివాహమైంది. అయితే.. భర్తని కాదని మరో వ్యక్తితో పరారయ్యింది.  ఈ విషయం భర్తకు తెలియడంతో.. ఆమెను పట్టుకొచ్చాడు. అనంతరం.. గ్రామంలో  ఆమెను దారుణంగా కొట్టి.. నగ్నంగా ఊరేగించారు.  అనంతరం బలవంతంగా ఆమె భుజాలపై భర్తను కూర్చోపెట్టి ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు రావడంతో..  పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ సంఘటన గుజరాత్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గుజరాత్ రాష్ట్రం దహోడ్ జిల్లాకు చెందిన ఓ మహిళకు భర్త ఉన్నాడు. అయినా.. అతనిని కాదని.. మరో వ్యక్తితో లేచిపోయింది. ఈ విషయం భర్త, అతని కుటుంబసభ్యులకు తెలియడంతో... వెంటనే లేచిపోయిన జంట ఎక్కడ ఉందో కనుక్కున్నారు.

పారిపోయిన భార్యను పట్టుకొచ్చిన భర్త.. ఆమెకు శిక్ష విధించారు. ఈ ఘటన ఈ నెల మొదట్లో చోటుచేసుకుంది. ఆమెను దారుణంగా జుట్టుపట్టుకొచ్చి ఈడ్చుకెళ్లాడు. అనంతరం ఆమెను నగ్నంగా గ్రామంలో ఊరేగించారు. ఆ తర్వాత బలవంతంగా... సదరు మహిళ భుజాలపై కూర్చోపెట్టి.. ఊరేగించారు. దీనంతటినీ కొందరు వీడియో తీయగా.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దీంతో.. పోలీసుల కంట ఆ వీడియో పడింది. వెంటనే సదరు మహిళ భర్త, మరో 18మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు  చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం