
న్యూఢిల్లీ: గుజరాత్ పోలీసుల ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. ఆ ట్విట్టర్ అకౌంట్ పేరును ఎలన్ మస్క్‌గా మార్చారు. అంతేకాదు, ఆ ట్విట్టర్ హ్యాండిల్ డీపీ కూడా మార్చేశారు. ఓ స్పేస్ షిప్ ఫొటోను డీపీగా అప్‌లోడ్ చేశారు. ఈ విషయంపై గుజరాత్ హోం శాఖ మంత్రి హర్ష సంఘవి స్పందించారు.
గుజరాత్ పపలీసుల అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ హ్యాక్‌కు గురైందని రాష్ట్ర మంత్రి హర్ష సంఘవి పేర్కొన్నారు. ఈ విషయాన్ని అందరి దృష్టికి తీసుకురావడానికే ఈ ప్రకటన చేస్తున్నట్టు తెలిపారు. తదుపరి నోటీసులు ఇచ్చే వరకు ఈ అకౌంట్ నుంచి వచ్చిన మెస్సేజీలను పరిగణనలోకి తీసుకోవద్దని కోరారు. అయితే, ప్రస్తుతం ఆ ట్విట్టర్ అకౌంట్ మళ్లీ మనుగడలోకి వచ్చినట్టు తెలిసింది.
ఇదే ఏడాది జనవరిలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ ఎఫైర్స్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, మన్ దేశీ మహిళా బ్యాంక్‌ల ట్విట్టర్ అకౌంట్లు హ్యాక్ అయ్యాయి. ఈ హ్యాకర్లు అకౌంట్ పేర్లను ఎలన్ మస్క్‌గా పేర్కొంటున్నారు. గతేడాది డిసెంబర్‌లో ప్రధాని మోడీ పర్సనల్ ట్విట్టర్ హ్యాండిల్ స్వల్పంగా హ్యాక్‌కు గురైందని వివరించారు.