
Gujarat: గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోని అలెంటో హోటల్‌లో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రాథమిక నివేదికల ప్రకారం.. హోటల్ భవనంలోని చిక్కుకున్న 27 మందిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా కాపాడారు. ఈ ఘటనలో ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదని జామ్‌నగర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ప్రేమ్‌సుఖ్ దేలు తెలిపారు. హోటల్ పూర్తిగా ధ్వంసమైంది. భవనం చుట్టూ భారీగా మంటలు ఎగిసిపడిన దృశ్యాలు కనిపించాయి. మంటలను ఆర్పడానికి సంఘటన స్థలానికి 5 అగ్నిమాపక యంత్రాలు చేరుకున్నాయి.
రాత్రి 7:30 గంటల ప్రాంతంలో హోటల్ లో మంటలు చెలారేగాయి. కాసేపటికి హోటల్ మొత్తం వ్యాపించాయి. మొత్తం 36 గదులలో 18 గదులలో ఇరవై ఏడు మంది అతిథులు ఉన్నారు. వారందరినీ పోలీసులు రక్షించారు. హోటల్ సిబ్బంది కూడా సురక్షితంగా ఉన్నారని పోలీసులు చెప్పారు. 5 అగ్నిమాపక యంత్రాలు ఘటన స్థలానికి మంటలర్పాయి. రాత్రి 10:30 గంటలకు మంటలు అదుపులోకి వచ్చాయని పోలీసులు తెలిపారు. అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసు అధికారి తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.