మానసిక సమస్యలతో వేగలేక ఆత్మహత్య చేసుకోబోయి మెడలోకి కత్తి.. హాస్పిటల్‌లో మూడు గంటల సర్జరీ.. ఏమైందంటే?

By Mahesh K  |  First Published Nov 10, 2023, 5:42 PM IST

గుజరాత్‌లో ఓ వ్యక్తి మానసిక సమస్యలకు సతమతమై ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. కత్తి తీసుకుని మెడలోకి దించాడు. ఆ తర్వాత స్పృహ కోల్పోయి కిందపడిపోయాడు. కుటుంబ సభ్యులు ఆయనను చూసి వెంటనే హాస్పిటల్ తరలించారు. మూడు గంటలు సర్జరీ చేసి ఆ కత్తిని వైద్యులు విజయవంతంగా బయటకు తీయగలిగారు. 
 


అహ్మదాబాద్: మానసిక సమస్యలతో సతమతం అవుతున్న ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోబోయాడు. కత్తితో గాయపరుచుకోవాలని అనుకున్నాడు. కత్తి తీసి మెడలోకి దోపుకున్నాడు. స్పృహ కోల్పోయి కిందపడిపోయాడు. నెత్తురు పారింది. ఇంతలో కొందరు ఆ వ్యక్తిని చూసి హాస్పిటల్ తరలించారు. వైద్యులు వెంటనే అడ్మిట్ చేసుకుని మూడు గంటలపాటు ఆపరేషన్ చేశారు.

ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. 57 ఏళ్ల వ్యక్తి తన మానసిక సమస్యలతో వేగలేకపోయాడు. అహ్మదాబాద్ నానా చిలోడాకు చెందిన ఆ వ్యక్తి తన జీవితాన్ని చాలించాలని ఫిక్స్ అయ్యాడు. అక్టోబర్ 31న ఆ వ్యక్తి కత్తి తీసుకుని మెడలో దింపాడు. ఆ తర్వాత నెత్తురు ఎక్కువ కారిపోవడంతో స్పృహ కోల్పోయి కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు ఆయనను చూసి వెంటనే ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. 

Latest Videos

Also Read : తెలంగాణ ఎన్నికల్లో జనసేనకు షాక్.. వారంతా ఇండిపెండెంట్ అభ్యర్థులు గానే బరిలోకి?.. బీజేపీలో ఆగ్రహం!

ఆ కత్తికి ఉండే పిడి మాత్రమే బయటికి కనిపించింది. వైద్యులు వెంటనే ఆయనను ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లి మూడు గంటలపాటు సర్జరీ చేశారు. ఏమాత్రం జాప్యం జరిగినా ఆయన ప్రాణాలు దక్కేవి కావని వైద్యులు తెలిపారు. అదృష్టవశాత్తు ఆ కత్తి ఆయన మెయిన్ ఆర్టరీకి తగలకుండా వెళ్లిందని వివరించారు. అందుకే ఆయన ప్రాణాలను కాపాడగ లిగామని చెప్పారు. చివరకు ఆ కత్తిని విజయవంతంగా మెడలో నుంచి బయటికి తొలగించి సదరు వ్యక్తి ప్రాణాలను వైద్యులు కాపాడారు.

click me!