కొత్తిమీరకి, మెంతి కూరకి తేడా చెప్పు: రాహుల్‌కు గుజరాత్ సీఎం సవాల్

By Siva KodatiFirst Published Dec 8, 2020, 3:19 PM IST
Highlights

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సెటైర్లు వేశారు. మెంతి కూరకు, కొత్తిమీరకు తేడా తెలియని రాహుల్‌ రైతుల గురించి మాట్లాడటం వింతగా ఉందన్నారు

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సెటైర్లు వేశారు. మెంతి కూరకు, కొత్తిమీరకు తేడా తెలియని రాహుల్‌ రైతుల గురించి మాట్లాడటం వింతగా ఉందన్నారు.

దేశ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని, విపక్షాలను తరిమి కొట్టారని.. ఇప్పుడు వారు రైతులకు మద్ధతు తెలుపుతున్నామంటూ ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ ప్రశ్నకు సమాధానం చెబితే.. రాహుల్ గాంధీకి వ్యవసాయం, రైతుల గురించి అవగాహన ఉందో లేదో తెలుస్తుందని విజయ్ రూపానీ వెల్లడించారు. 

ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలని ఒక్కొక్కటిగా సాల్వ్‌ చేస్నున్నారని రూపానీ పేర్కొన్నారు. ప్రస్తుతం రైతుల పేరు చెప్పి కాంగ్రెస్‌ లబ్ది పొందాలని భావిస్తోందని గుజరాత్ సీఎం ఆరోపించారు.

అధికారంలో ఉన్నన్ని రోజులు ఆ పార్టీ విద్యుత్‌, విత్తనాలు, ఎరువులు, కనీస మద్దతు ధర, సాగు నీరు వంటి అంశాల గురించి అస్సలు పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు.  బీజేపీ హయాంలో వీటన్నింటిని సాధిస్తుంటే తట్టుకోలేకపోతుందంటూ రూపానీ విమర్శించారు.

కాగా, కేంద్రం తీసుకువచ్చిన నూతన చట్టాలకు వ్యతిరేకంగా రైతులు భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు, వ్యాపార సంఘాలు రైతులకు మద్దతుగా రోడుపైకి వచ్చి నిరసన తేలుపుతున్నాయి. కానీ గుజరాత్‌లో మాత్రం భారత్‌ బంద్‌ పాటించమని ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

click me!