గుజరాత్‌లో ప్రభావం చూపని ఆప్: ఓటమి పాలైన సీఎం అభ్యర్ధి ఇసుదాన్

By narsimha lodeFirst Published Dec 8, 2022, 5:16 PM IST
Highlights

గుజరాత్ లో  ఆప్  ప్రభావం చూపలేకపోయింది. సీఎం అభ్యర్ధి ఇసుదాన్ గాధ్వి ఓటమి పాలయ్యాడు.  కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓటు బ్యాంకును ఆప్ భారీగా చీల్చింది. దీంతో కాంగ్రెస్  పార్టీ  తక్కువ స్థానాలకు పడిపోయింది. 

న్యూఢిల్లీ:గుజరాత్ రాష్ట్రంలో ఆప్ పెద్దగా  ప్రభావం చూపలేకపోయింది.  పంజాబ్ రాష్ట్రంలో  జరిగిన ఎన్నికల్లో ఆప్  విజయం సాధించినప్పటికీ  గుజరాత్ ఎన్నికల్లో  ఆ పార్టీ  ఆశించిన  ప్రభావం చూపలేకపోయింది. సీఎం అభ్యర్ధిగా బరిలోకి దిగిన ఇసుదాన్ గాధ్వి  ఓటమి పాలయ్యాడు. బీజేపీకి భారీ  సీట్లు దక్కడంలో  ఆప్  పరోక్షంగా దోహదపడింది.  కాంగ్రెస్ పార్టీ ఓట్లను ఆప్ చీల్చింది. దీంతో కాంగ్రెస్ 16 స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. ఐదు స్థానాల్లో  ఆప్  ప్రభావం చూపింది.  

 గుజరాత్  ఎన్నికల  ముందు  ఆప్ చీఫ్  కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, గణపతి బొమ్మలను ముద్రించాలని  డిమాండ్  చేశారు. ఈ  ఎన్నికలను పురస్కరించుకొని ఆప్  ఈ నినాదాన్ని తీసుకువచ్చిందని  పెద్ద ఎత్తున  కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు విమర్శలు చేశాయి.  గుజరాత్  లో బీజేపీని దెబ్బతీసేందుకు గాను   ఈ డిమాండ్ ను ఆప్ తీసుకువచ్చిందనే విమర్శలు లేకపోలేదు. బీజేపీ హిందూత్వకు చెక్ పెట్టేందుకు బీజేపీ ఈ నినాదం తెరమీదికి తెచ్చిందనే ప్రత్యర్ధులు  విమర్శలు  చేసిన  విషయం తెలిసిందే.

ఢిల్లీలో తరహాలో విద్యావిధానం, ఆసుపత్రులు, పంజాబ్ తరహాలో విద్యుత్ బిల్లుల వంటి  పథకాలను అమలు చేస్తామని  ఆప్  ప్రచారం నిర్వహించింది.  అయితే గుజరాత్ రాష్ట్రంలో  ఆప్ పార్టీకి క్షేత్రస్థాయిలో  బలం లేదు. బీజేపీ ఈ రాష్ట్రంలో సంస్థాగతంగా బలం ఉంది.  రాజకీయంగా  బీజేపీకి ఇది కలిసి వచ్చింది.  అయితే  గత ఎన్నికలతో పోలిస్తే  ఆప్  పార్టీ ఈ దఫా  ఓటు షేర్ ను పెంచుకుంది.  ఆప్ పార్టీకి వచ్చిన సీట్లలో  కాంగ్రెస్ పార్టీ నుండి చీల్చినవే కావడం  గమనార్హం. గుజరాత్ లో  కాంగ్రెస్ పార్టీ  తక్కువ సీట్లకు పడిపోవడానికి  ఆప్  ఓట్లను చీల్చడమే ప్రధాన కారణంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గుజరాత్ రాష్ట్రంలో ప్రధాని మోడీ విస్తృతంగా పర్యటించారు.  కేంద్ర మంత్రి అమిత్ షా రెండు నెలలు మకాం వేశారు. సుమారు  45 మంది  సిట్టింగ్ లకు  కూడా బీజేపీ  టికెట్లు ఇవ్వలేదు.

గుజరాత్ లో సీఎం అభ్యర్ధి ఇసుదాన్ గాధ్వి ప్రజలతో కనెక్ట్ కావడంలో విఫలమయ్యారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.. బీజేపీ అభ్యర్ధి హర్ధాస్ భాయ్ బేరా చేతిలో  ఇసుదాన్ గాధ్వి  ఓటమి పాలయ్యారు ఏడాది క్రితమే ఆయన  రాజకీయాల్లోకి వచ్చారు. ఏడాది క్రితం ఆయన ఆప్ లో చేరారు. ఆప్ ఆయనను జాతీయ సెక్రటరీగా నియమించింది. గుజరాత్ ఎన్నికల సమయంలో  సీఎం అభ్యర్ధిగా కేజ్రీవాల్ ఆయనను ప్రకటించింది.

also read:హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌దే హవా: తొమ్మిది దఫాలు హస్తానిదే ఆధిక్యం, నాలుగు సార్లు కమల వికాసం

కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ లు విస్తృతంగా  ప్రచారం నిర్వహించారు. అయినా కూడా ప్రజలు ఆప్ పట్ల మొగ్గు చూపలేదని ఫలితాలు వెల్లడిస్తున్నాయి.రైతు కుటుంబానికి చెందిన  గాధ్వి  రాజకీయాల్లో చేరిన  ఏడాదిలోనే ఎన్నికలను ఎదుర్కోవాల్సి వచ్చింది. జర్నలిస్టుగా అనేక అవినీతి కుంభకోణాలను  ఆయన బయటకు తీసుుకువచ్చారు. .
 

click me!