ఘెర రోడ్డు ప్రమాదం...8మంది మృతి, 22మందికి గాయాలు

Published : Mar 03, 2020, 07:49 AM IST
ఘెర రోడ్డు ప్రమాదం...8మంది మృతి, 22మందికి గాయాలు

సారాంశం

ఆ బస్సుని ఎదురుగా వస్తున్న ఓ వాటర్ ట్యాంకర్ వచ్చి ఢీ కొట్టింది. కొద్ది సేపటికే అటుగా వచ్చిన ఓ జీపు బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మూడు వాహనాల్లో మొత్తం 8 మంది మృతి చెందారు. మరో 22మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.  

గుజరాత్‌లో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తపి జిల్లాలో బస్సు-ట్యాంకర్‌-జీపు ఒకదానికి ఒకటి పరస్పరం ఢీకొని 8మంది చనిపోయారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. గుజరాత్‌ రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు ప్రయాణికులతో వెళుతోంది.

Also Read భర్త మీద పగ.. కన్న కొడుకునే చంపేసిన తల్లి...

ఆ బస్సుని ఎదురుగా వస్తున్న ఓ వాటర్ ట్యాంకర్ వచ్చి ఢీ కొట్టింది. కొద్ది సేపటికే అటుగా వచ్చిన ఓ జీపు బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మూడు వాహనాల్లో మొత్తం 8 మంది మృతి చెందారు. మరో 22మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ట్యాంకర్ రాంగ్ రూట్ లో రావడం కారణంగానే ప్రమాదం జరిగిందని తెలిపారు పోలీసులు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు | Best Prime Minister of India | Best CM
ట్రైన్ లో వాటర్ ఎలా సప్లై అవుతుంది? నీళ్లు ఎక్కడ స్టోర్ చేస్తారు? | Railway Quick Watering System