ఘోర ప్రమాదం: కాలువలోకి దూసుకెళ్లిన కారు, ఏడుగురు చిన్నారుల మృతి

Published : Aug 13, 2018, 11:53 AM ISTUpdated : Sep 09, 2018, 02:01 PM IST
ఘోర ప్రమాదం: కాలువలోకి దూసుకెళ్లిన కారు, ఏడుగురు చిన్నారుల మృతి

సారాంశం

గుజరాత్‌లోని  పంచమహల్  సమీపంలోని ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు చిన్నారులు మృతి చెందారు. పది మందితో  ప్రయాణీస్తున్న కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లగా  ఈ ప్రమాదం  చోటుచేసుకొంది.


గాంధీనగర్: గుజరాత్‌లోని  పంచమహల్  సమీపంలోని ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు చిన్నారులు మృతి చెందారు. పది మందితో  ప్రయాణీస్తున్న కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లగా  ఈ ప్రమాదం  చోటుచేసుకొంది.

కారు కాలువలోకి దూసుకెళ్లిన విషయాన్ని గుర్తించిన  స్థానికులు వారిని రక్షించేలోపుగా  కారు కాలువలోకి దూసుకెళ్లింది.  కారులో ఉన్న ముగ్గురిని మాత్రమే స్థానికులు రక్షించారు. ఈ కారులో ఉన్న ఏడుగురు  కారులోనే  ఉన్నారు. 

కారుతో సహా 7 చిన్నారులు కాలువలోనే మునిగిపోయారు. దీంతో వారు అక్కడిక్కడే మరణించారు.  మృతులంతా  ఏడు నుండి 16 ఏళ్ల వయస్సులోపువారే.  ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు.
 

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?