జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్: 33 వస్తువులపై 18 శాతానికి ట్యాక్స్ తగ్గింపు

By narsimha lodeFirst Published Dec 22, 2018, 4:17 PM IST
Highlights

సుమారు 33 రకాల వస్తువులపై  జీఎస్టీ పన్నును తగ్గించాలని  జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకొంది. 


న్యూఢిల్లీ: సుమారు 33 రకాల వస్తువులపై  జీఎస్టీ పన్నును తగ్గించాలని  జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకొంది. 

జీఎస్టీ కౌన్సిల్ సమావేశం శనివారం నాడు న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో  పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. 33 వస్తువులపై జీఎస్టీ పన్నును 33 శాతం నుండి 18 శాతానికి తగ్గించాలని  నిర్ణయం తీసుకొన్నారు. 

మరో 7 రకాల వస్తువులపై 28 నుండి 18 శాతానికి తగ్గించారు.కొన్ని వస్తువులపై పన్నును 18 నుండి 5 శాతానికి కూడ తగ్గించినట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు.

34 విలాసవంతమైన వస్తువులపై 28 శాతం పన్నును విధించినట్టు జీఎస్టీ కౌన్సిల్ ప్రకటించింది. మూడు వస్తువులపై 18 శాతం పన్నును 12 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకొన్నారు. రూ.100 సినిమా టిక్కెట్టుపై 18 శాతం నుండి 12 శాతానికి పన్నును తగ్గించారు.

click me!