జమ్మూ కశ్మీర్‌‌లో భారీ ఎన్కౌంటర్‌: అల్‌ఖైదా అధిపతి సన్నిహితుడి మృతి

By Arun Kumar PFirst Published Dec 22, 2018, 12:33 PM IST
Highlights

భారత్ లోకి అక్రమంగా చొరబడి భారీ హింసకు పథకం రచిస్తున్న ఆరుగురు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుపెట్టాయి. జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో తలదాచుకున్న ఆల్‌ఖైదా ఉగ్రవాదులు భారత సైన్యం కాల్పుల్లో హతమయ్యారు. మొత్తం ఆరుగురు ఉగ్రవాదులు ఈ ఎన్కౌంటర్ లో మృతిచెందినట్లు సమాచారం. మృతుల్లో ఆల్‌ఖైదా ఉగ్రవాద సంస్థకు చెందిన ఓ కీలక నేత మృతి చెందినట్లు భద్రతాధికారులు వెల్లడించారు. 
 
పుల్వామా జిల్లాలోని ఓ నివాసంలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు విశ్వసనీయంగా సమాచారం రావడంతో భద్రతా దళాలు అమ్రమత్తమయ్యాయి. ఇవాళ తెల్లవారుజామును పథకం ప్రకారం ఉగ్రవాదులు ఉంటున్న ఇంటి  వద్దకు భారీ బలగాలు చేరుకున్నాయి. అయితే ఈ విషయాన్ని గమనించిన ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా  బలగాలు కూడా ఎదురు కాల్పులకు దిగడంతో ఆరుగురు ఉగ్రవాదులు మృతిచెందారు. 

మృతిచెందిన ఉగ్రవాదుల్లో ఒకడు ఆల్‌ఖైదా అధిపతి జకీర్ ముసాకు అత్యంత సన్నిహితుడిగా అనుమానిస్తున్నారు. అతడి నేతృత్వంలోనే ఇండియాలోకి ప్రవేశించిన ఉగ్రవాదుల బృందం భారీ హింసకు ప్రయత్నిస్తుండగా భారత బలగాల కాల్పుల్లో హతమయ్యారు. 

తెల్లవారుజామున ప్రారంభమైన కాల్పులు దాదదాపు నాలుగు గంటలపాటు కొనసాగాయి. ఈ ఎన్కైంటర్ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్న భద్రతా బలగాలు ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు దాగున్నారేమోనని సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా ఆక్షంలు విధించారు.  

click me!