ఉత్తర ప్రదేశ్ లో దారుణం...ప్రేమవివాహం చేసుకుందని.. ఉమ్ము నాకించి..

Published : Dec 07, 2022, 10:21 AM IST
ఉత్తర ప్రదేశ్ లో దారుణం...ప్రేమవివాహం చేసుకుందని.. ఉమ్ము నాకించి..

సారాంశం

తమ ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమ వివాహం చేసుకుందని ఓ గ్రామపెద్దలు యువతిని అత్యంత ఘోరంగా అవమానించారు. 

ఉత్తర ప్రదేశ్ : తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని ప్రేమ వివాహం చేసుకుందని…  తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అత్యంత దారుణాలకు తెగిస్తుంటారు. ఆ జంటను హింసించడం, భార్యభర్తలని వేరు చేయడం.. పరువు హత్యలకు దిగజారడం  చేస్తుంటారు. తమ మాట కాదని వేరే కులం వ్యక్తిని పెళ్ళి చేసుకోకూడదని అనేక ఆంక్షలు పెడుతుంటారు. అలాంటి ఓ దారుణమైన ఘటన ఉత్తర ప్రదేశ్లో వెలుగు చూసింది. ఓ జంట తాజాగా ప్రేమ వివాహం చేసుకుంది. వారిని గదిలో బంధించిన యువకులు.. వారితో అసభ్యంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘాజీపూర్ పరిధి బుజుర్గ్ గ్రామంలో ఈ దారుణమైన ఘటన జరిగింది. ఈ గ్రామానికి చెందిన ఓ యువతి ఇటీవల.. తను ఇష్టపడ్డ యువకుడిని అక్కడి గుళ్లోలవ్ మ్యారేజ్ చేసుకుంది. అయితే ఈ విషయం కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. అందుకే వారిద్దరూ వివాహం తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. పెళ్లి విషయం తెలిసిన కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు అందరూ కలిసి వారిద్దరి కోసం అన్ని చోట్లా గాలించారు.

చిన్నారులను కొని.. పెంచిన తరువాత వ్యభిచార రొంపిలోకి దింపి.. యాదగిరిగుట్టలో దారుణం...

వేరేచోట వారిద్దరూ దొరకడంతో వారిని ఊరికి తీసుకువచ్చారు. ఓ ఇంట్లో బంధించారు. వారిద్దరిని కుర్చీలకు కట్టేసి అత్యంత దారుణంగా ప్రవర్తించారు. కర్రలతో కొట్టారు.నేలమీద ఉమ్మేయించి..దాన్ని మహిళతో నాలుకతో  నాకించారు. నేలకు ముక్కు రాయించారు. తమని వదిలేయమని యువతి ఎంతగా వేడుకున్నా వినిపించుకోలేదు. ఆ తర్వాత యువకుడిని కూడా నేలమీద ముక్కుతో రాయమన్నారు. దీనికి ఆ యువకుడు ఒప్పుకోకపోవడంతో అతని మీద విచక్షణారహితంగా దాడి చేశారు. 

వారిద్దరి దగ్గర ఉన్న ఫోన్లను లాక్కున్నారు. ఈ దాడి ఘటనను మొత్తం పెద్ద ఘనకార్యం చేసినట్లుగా వీడియో తీశారు. ఆ తర్వాత వీటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇవి వైరల్ కావడంతో పోలీసులకు విషయం తెలిసింది. గ్రామ పెద్దలైన బ్రిజేష్ యాదవ్ తదితరులపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Ukrainian Woman Lidia Lakshmi Slams YouTuber Anvesh Over Comments Hindu Gods | Asianet News Telugu
అయోధ్య రామమందిరానికి హై సెక్యూరిటీ.. ఎలాగో తెలుసా?