Viral Video:వధువు పాదాలను తాకిన వరుడు.. నెటిజన్ల మనసు దోచేస్తున్న వీడియో..!

Published : Jun 28, 2022, 01:20 PM IST
Viral Video:వధువు పాదాలను తాకిన వరుడు.. నెటిజన్ల మనసు దోచేస్తున్న వీడియో..!

సారాంశం

వరుడు పెళ్లి తంతు ముగియగానే... తన భార్య కాళ్లు తాకాడు. మామూలుగా అయితే.. వధువు.. వరుడి పాదాలను తాకాలి. ఆ పెళ్లి చేసిన పంతులు కూడా అదే చెప్పాడట. 

పెళ్లి అన్నాక.. చాలా సంప్రదాయాలు ఉంటాయి. పెళ్లిలో భాగంగా.. చాలా మంది వధువులు.. తాళి కట్టిన తర్వాత.. వరుడి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకుంటారు. ఇది చాలా మంది చూసే ఉండచ్చు. అయితే.. అనూహ్యంగా ఓ పెళ్లి వేడుకలో వరుడు.. వధువు పాదాలను తాకాడు.  దీంతో... ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. నెటిజన్లు.. ఈ వీడియోకి ఫిదా అయిపోతున్నారు.

కాగా.. తాజాగా ఓ  యువతి ఈ పెళ్లికి సంబంధించిన వీడియోని షేర్ చేశాడు. అందులో.. వరుడు పెళ్లి తంతు ముగియగానే... తన భార్య కాళ్లు తాకాడు. మామూలుగా అయితే.. వధువు.. వరుడి పాదాలను తాకాలి. ఆ పెళ్లి చేసిన పంతులు కూడా అదే చెప్పాడట. కానీ.. వరుడు మాత్రం ప్రేమగా.. తన భార్య కాళ్లను తాకాడు. 

ఆ తర్వాత ఆమెను హత్తుకున్నాడు. ఈ వీడియోని సదరు పెళ్లి కూతురే షేర్ చేయడం గమనార్హం. తన భర్త చేసిన విషయం అక్కడ పంతులకు అస్సలు నచ్చలేదట. అయితే.. తర్వాత.. మాత్రం నువ్వు చాలా అదృష్టవంతురాలు అంటూ సదరు పంతులు వధువు చెవిలో చెప్పాడట. ఆ విషయాన్ని కూడా ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొనడం గమనార్హం. ఏది ఏమైనా ఈ వీడియో ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వధువుని.. అదృష్టవంతురాలు అని.. వరుడు ఎంత మంచి వాడంటూ.. కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.

ఈ వీడియోకి ఇప్పటికే 5లక్షలకు పైగా వ్యూస్ రావడం గమనార్హం.వీడియోలో, వరుడు మలయాళం , ఇంగ్లీషు రెండింటిలోనూ ప్రతిజ్ఞను చేయడం గమనార్హం.  మొదట్లో ఇంగ్లీషులో ప్రారంభించిన అతను వెంటనే మలయాళానికి మారాడు. వధువు మాతృ భాష మళయాళం కావడంతో.. ఆ భాషలో కూడా ఆమె ప్రమాణం చేయడం విశేషం.

వీడియో ఇక్కడ చూడండి..వధువు పాదం తాకిన వరుడు

PREV
click me!

Recommended Stories

Nepal flash flood | నేపాల్‌లో వరద బీభత్సం వందల మంది గల్లంతు | Trishuli River Flood
దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు | Best Prime Minister of India | Best CM