రైతులకు మద్ధతుగా గ్రేటా థన్‌బెర్గ్ ట్వీట్: బయటపడిన భారత వ్యతిరేక కుట్ర

By Siva KodatiFirst Published Feb 3, 2021, 11:42 PM IST
Highlights

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువచ్చిన కొత్త‌ వ్యవసాయ చట్టాలను ర‌ద్దు చేయాల్సిందేనంటూ ఢిల్లీలో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తోన్న విష‌యం తెలిసిందే. దీనిపై ఇప్ప‌టికే ప‌లు దేశాలు కూడా స్పందించాయి.

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువచ్చిన కొత్త‌ వ్యవసాయ చట్టాలను ర‌ద్దు చేయాల్సిందేనంటూ ఢిల్లీలో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తోన్న విష‌యం తెలిసిందే. దీనిపై ఇప్ప‌టికే ప‌లు దేశాలు కూడా స్పందించాయి. తాజాగా, ప్రముఖ పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రేటా థ‌న్‌బ‌ర్గ్, హాలీవుడ్‌ పాప్‌ స్టార్‌ రిహన్నా కూడా భార‌త రైతుల ఉద్య‌మం గురించి స్పందించ‌డం గ‌మ‌నార్హం.

ఉద్య‌మం చేస్తోన్న‌ భారత్‌లోని రైతులకు  సంఘీభావం తెలుపుతున్నామంటూ  గ్రెటా థన్‌బర్గ్ ట్వీట్ చేశారు. ఓ వార్తా ప‌త్రిక‌లో వ‌చ్చిన క‌థ‌నాన్ని ఈ సంద‌ర్భంగా ఆమె పోస్ట్ చేశారు. ఢిల్లీలో రైతుల ఉద్య‌మాన్ని అణ‌చివేసేలా పలు ప్రాంతాల్లో విధించిన ఆంక్షల వంటి అంశాలను ఆ వార్త‌లో ప్ర‌చురించారు. అయితే ఇది అనుకోకుండా భారతదేశాన్ని కించపరిచే అంతర్జాతీయ కుట్ర అని నరేంద్రమోడీ ప్రభుత్వం చేసిన వాదనను ధ్రువీకరించేలా వుంది. 

భారతదేశంలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనలకు సంఘీభావం తెలియజేయాలనుకునేవారికి టూల్ కిట్‌ ఇచ్చేలా గ్రేటా ట్విట్టర్‌లోకి వెళ్లారు. ఈ క్రమంలో రిపబ్లిక్ డేకి ముందు రోజులలో ప్రారంభమైన సంఘటిత ప్రచారాన్ని గ్రేటా వెల్లడించారు. ఇది జనవరి 26న భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన గ్లోబళ్లీ కో ఆర్డినేటెడ్ యాక్షన్‌గా తెలుస్తోంది. 

ట్విట్టర్‌లో ఆమె పోస్ట్ చేసిన ఆరు పేజీల సమాచారంలో ‘‘ మీ చుట్టూ జరుగుతున్న నిరసనలను కనుగొనండి. మీ సమీపంలోని భారతీయ రాయబార కార్యాలయాల సమీపంలో, స్థానిక ప్రభుత్వ కార్యాలయాల వద్ద, అంబానీ, ఆదానీ కార్యకలాపాల సమీపంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించండి. మేము జనవరి 26వ తేదీపై ఫోకస్ పెట్టాం.. మీరు సాధ్యమైనంత వరకు సమావేశాలను నిర్వహించడం కొనసాగించండి. ఇది ఇప్పట్లో ముగియదు అని అందులో వుంది. భారతదేశం ప్రజాస్వామ్యం నుంచి వెనక్కి వెళుతోందని, ఫాసిజంలోకి చొచ్చుకెళ్లడం వల్ల ఇది తిరోగమనం’’ అని పేర్కొన్న వివాదాస్పద కార్యాచరణ ప్రణాళిక ద్వారా భారత ప్రభుత్వంపై అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావడమే ముఖ్యమని పేర్కొంది. 

అలాగే ఫిబ్రవరి 13 - 14 తేదీలలో వివిధ దేశాల్లోని భారత రాయబార కార్యాలయం, మీడియా హౌస్, స్థానిక ప్రభుత్వ కార్యాలయం సమీపంలో మరొక ఆన్ గ్రౌండ్ చర్యకు పిలుపునిచ్చినట్లుగా ఆ పత్రాల్లో వుంది. భారతదేశానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతును సమీకరించటానికి ప్రయత్నిస్తున్న కొన్ని స్వార్థ ప్రయోజన సంఘాలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ చేసిన వాదనలకు అనుగుణంగా గ్రేటా షేర్ చేసిన పత్రాల్లో వుంది. మరోవైపు సంచలనాలకు మొగ్గు చూపే వ్యక్తులే ఇలా చేస్తున్నారు. ఆ ట్వీట్లకు ఏమాత్రం కచ్చితత్వం లేదు. బాధ్యతారాహిత్యమని కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటించింది..  

click me!