రైతు ఉద్యమానికి మద్దతు: గ్రెటా థంబర్గ్‌పై కేసు

Published : Feb 04, 2021, 04:36 PM IST
రైతు ఉద్యమానికి మద్దతు: గ్రెటా థంబర్గ్‌పై కేసు

సారాంశం

నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ సామాజిక కార్యకర్త గ్రెటా థంబర్గ్ చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. ఈ ట్వీట్ రెచ్చగొట్టేవిధంగా ఉందని పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.  


న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ సామాజిక కార్యకర్త గ్రెటా థంబర్గ్ చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. ఈ ట్వీట్ రెచ్చగొట్టేవిధంగా ఉందని పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.

రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపేక్రమంలో రెచ్చగొట్టేవిధంగా వ్యవహరించారని పోలీసులు కేసు నమోదు చేశారు. 120B, 153A, ఐటీ యాక్ట్  కింద కేసులు నమోదు చేసినట్టుగా పోలీసులు చెప్పారు.గ్రెటా థంబర్గ్ తో పాటు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హరీష్ మేనకోడలు. కూడ ఇండియాలో రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతు ప్రకటించారు. రైతుల ఉద్యమాన్ని  సంఘీభావంగా  ప్రకటించారు.     సీఎన్ఎన్ వార్తా కథనాన్ని థంబర్గ్ ట్వీట్ చేశారు. 

also read:రైతుల వద్దకు విపక్ష ఎంపీల బృందం: ఘాజీపూర్ వద్దే అడ్డుకొన్న పోలీసులు

రైతుల ఉద్యమంపై విదేశీ ప్రముఖులు చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగానే స్పందించింది. దేశంలోని చాలా మంది తక్కువ రైతులు వ్యవసాయ సంస్కరణల గురించి ఆందోళన చెందుతున్నారని చెప్పింది. ఈ విషయమై వ్యాఖ్యానించే ముందు సరైన అవగాహన అవసరమన్నారు.
 

PREV
click me!

Recommended Stories

Top 5 Biggest Railway Stations : ఏ ముంబై, డిల్లీలోనో కాదు.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు