మీరు ఈ వ్యాపారాలు చేయాలనుకుంటున్నారా? యోగి సర్కార్ అద్భుత అవకాశం

By Arun Kumar PFirst Published Oct 24, 2024, 2:16 PM IST
Highlights

గ్రేటర్ నోయిడాలో విద్యాసంస్థలు, ఆసుపత్రులు, లేదంటే ఇతర వ్యాపారాల కోసం ప్లాట్ల ఈ-వేలం ప్రక్రియ ప్రారంభమయ్యింది. అక్టోబర్ 24 నుండి దరఖాస్తు చేసుకోండి, కోట్లలో బిడ్డింగ్ చేసి మీ ప్లాట్‌ను పొందండి.

లక్నో : ఉత్తరప్రదేశ్‌ లోని గ్రేటర్ నోయిడా సమగ్రాభివృద్ధి దిశగా యోగి సర్కార్ మరో ముఖ్యమైన అడుగు వేసింది. గ్రేటర్ నోయిడా ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ నగరంలోని కెపి-05, ఎంయు, సెక్టార్ 10, ఇటిఎ-02, కెపి-01, టెక్‌జోన్-4లలో ఇన్‌స్టిట్యూషనల్ ప్లాట్ల కోసం ఈ-వేలానికి సిద్దమయ్యింది. ఇలా వేలంలో వుంచిన 13 ఇన్‌స్టిట్యూషనల్ ప్లాట్ల కోసం దరఖాస్తుదారులను ఆహ్వానించింది... వీటికి కోట్లలో బిడ్డింగ్ రావచ్చని అంచనా వేస్తున్నారు. 

ఈ పథకం కింద దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 24 నుండి ప్రారంభమవుతుంది. ఈ వేలం ద్వారా ప్లాట్లు పొందినవారు పాఠశాలలు, ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లు, పారామెడికల్, శిక్షణా సంస్థలు వంటివి ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా మొత్తం రూ.170 కోట్ల రూపాయల రిజర్వ్ ధర కలిగిన ప్లాట్ల కేటాయింపు జరుగుతుంది. దీంతో పాటు 43 వాణిజ్య దుకాణాలు, కార్యాలయాలు, 20 ధాబాలు, కియోస్క్‌ల ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ కూడా వేగవంతం చేసింది యోగి సర్కార్

ప్లాట్ల ధరలు ఎలా వున్నాయంటే...

Latest Videos

ఈ పథకం కింద 1000 నుండి 10,005 చదరపు మీటర్ల విస్తీర్ణం గల ప్లాట్ల కేటాయింపు జరుగుతుంది. గ్రేటర్ నోయిడా ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ ఈ-వేలానికి అందుబాటులో ఉంచిన ప్లాట్ల రిజర్వ్ ధర రూ.2.99 కోట్ల నుండి రూ.35.17 కోట్ల మధ్య ఉంది. ఈ పథకం కింద కెపి-05లోని ప్లాట్ 12బి విస్తీర్ణం 10 వేల చదరపు మీటర్లు, దీని రిజర్వ్ ధర 30.28 కోట్లు. కెపి-05లోని ప్లాట్ హెచ్‌ఎస్-12సి విస్తీర్ణం 6200 చదరపు మీటర్లు, దీని రిజర్వ్ ధర 18.34 కోట్లు. వీటిలో విద్యాసంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు.

ఇక ఎంయు సెక్టార్‌లోని ప్లాట్ హెచ్‌ఓ-2 అతిపెద్ద, ఖరీదైన ప్లాట్. దీని విస్తీర్ణం 10,005 చదరపు మీటర్లు, రిజర్వ్ ధర రూ.35.17 కోట్లు. సెక్టార్ 10లోని ప్లాట్ హెచ్‌ఓ-2 విస్తీర్ణం 4439.50 చదరపు మీటర్లు, రిజర్వ్ ధర రూ.19.52 కోట్లు. ఈ రెండు ప్లాట్లలో ఆసుపత్రులు ఏర్పాటు అవుతాయి.

ఇటిఎ-02లో 2511.40 చదరపు మీటర్ల విస్తీర్ణం గల ప్లాట్ ఎన్‌హెచ్-01 రిజర్వ్ ధర రూ.10.70 కోట్లు, ఇక్కడ నర్సింగ్ హోమ్ ఏర్పాటు అవుతుంది. కెపి-01లో ప్లాట్ 34 ఎ, బి విస్తీర్ణం 2 వేల చదరపు మీటర్లు, రిజర్వ్ ధర రూ.5.99 కోట్లు, ఇక్కడ పారామెడికల్, శిక్షణా సంస్థ ఏర్పాటు అవుతాయి.

టెక్ జోన్-4లో ప్లాట్ 06, 07 విస్తీర్ణం 2000.27 చదరపు మీటర్లు, రిజర్వ్ ధర రూ.5.99 కోట్లు. టెక్ జోన్-4లో 26, 27 విస్తీర్ణం 4000.39 చదరపు మీటర్లు, రిజర్వ్ ధర రూ.11.44 కోట్లు. కెపి-5లో ప్లాట్ 89 విస్తీర్ణం 2001 చదరపు మీటర్లు, రిజర్వ్ ధర రూ.5.72 కోట్లు. కెపి-01లో 34సి విస్తీర్ణం 1000.45 చదరపు మీటర్లు, రిజర్వ్ ధర రూ.2.99 కోట్లు. ప్లాట్లలో వృత్తి శిక్షణ, విద్యాసంస్థలు ఏర్పాటు అవుతాయి.

ఇన్‌స్టిట్యూషనల్ ప్లాట్ల ఈ-వేలం పథకం కోసం దరఖాస్తు చేయడానికి చివరి తేదీ నవంబర్ 18... ఈ-వేలం ప్రక్రియ నవంబర్‌లో పూర్తవుతుంది. గ్రేటర్ నోయిడా ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ వాణిజ్య దుకాణాలు, కార్యాలయాలు, ధాబాలు, కియోస్క్‌ల ఈ-వేలం ప్రక్రియ కూడా నవంబర్‌లోనే పూర్తవుతుంది. ఈ పథకం ద్వారా 43 వాణిజ్య దుకాణాలు, కార్యాలయాలు, 20 ధాబాలు, కియోస్క్‌ల ప్లాట్ల కేటాయింపు జరుగుతుంది. వీటి విస్తీర్ణం 10.40 నుండి 400 చదరపు మీటర్ల మధ్య ఉంటుంది, మొత్తం ఖర్చు 13.65 లక్షల నుండి 2.57 కోట్ల రూపాయల మధ్య ఉంటుంది.

click me!