ఎన్-95 మాస్క్ లు.. పెద్దగా ప్రయోజనం లేదా..?

By telugu news teamFirst Published Jul 21, 2020, 10:44 AM IST
Highlights

మామూలు మాస్క్ ల కన్నా ఎన్-95 మాస్క్ లు ధరిస్తే మంచిదని చాలా మంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మాస్క్ ల విషయంలో కేంద్ర ప్రభుత్వం షాకింగ్ కామెంట్స్ చేసింది. 
 

కరోనా వైరస్ దేశంలో విలయతాండవం చేస్తున్నాయి. ఎటునుంచి ఎవరికి వైరస్ సోకుతుందో అర్థం కావడం లేదు. దీంతో.. ప్రజలు వైరస్ పేరు చెబితేనే భయపడిపోతున్నారు. ఈ వైరస్ నేపథ్యంలో మాస్క్ ధరించడం తప్పనిసరి అయిపోయింది. మాస్క్ లేకుండా బయటకు వస్తే.. జరిమానా విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి.

అయితే.. మామూలు మాస్క్ ల కన్నా ఎన్-95 మాస్క్ లు ధరిస్తే మంచిదని చాలా మంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మాస్క్ ల విషయంలో కేంద్ర ప్రభుత్వం షాకింగ్ కామెంట్స్ చేసింది. 

అయితే వాల్వ్ రెస్పిరేట్లర్లు(ప్రత్యేక కవాటాలు) ఉన్న ఎన్-95 మాస్కులు కరోనా వ్యాప్తిని అడ్డుకోలేవని కేంద్రం తాజాగా ప్రజలను హెచ్చరించింది. ఈ విషయంలో ప్రజలను అప్రమత్తం చేయాలంటూ అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. ఇటువంటివి కరోనా వ్యాప్తికి కారణమవుతాయని కూడా లేఖలో పేర్కొంది. 

వీటికి బదులు ఇళ్లలో కాటన్ దుస్తులతో చేసిన మాస్కులు సురక్షితమని మరోసారి స్పష్టం చేసింది. ఇక ఇంట్లొనే మాస్కు ఎలా తయారు చేయాలనే దానిపై కేంద్రం ఇప్పటికే మార్గదర్శాకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన సూచనలను కేంద్ర ఆరోగ్య శాఖ వెబ్‌సైట్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచింది. 
 

click me!