సరోగసీ నిబంధనలను సవాలు చేస్తూ పిటిషన్‌ దాఖలు..  హైకోర్టుకు కేంద్రం వివరణ

By Rajesh KarampooriFirst Published Nov 8, 2022, 5:21 PM IST
Highlights

సరోగసీ చట్టంలోని కొన్ని నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కేంద్రం వ్యతిరేకించింది. నవజాత శిశువుల వ్యాపారీకరణను నిషేధించే ఉద్దేశ్యంతో సహాయక పునరుత్పత్తి సాంకేతికత (నియంత్రణ) చట్టం 2021,సరోగసీ (నియంత్రణ) చట్టం 2021 లు రూపొందించబడ్డాయని కేంద్రం తెలిపింది.

సరోగసీ చట్టాలోని  పలు నిబంధనలను సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిల్‌పై కేంద్రంతో పాటు ఇతరులకు నోటీసులు జారీ చేసింది. దీంతో మహిళలపై దోపిడీ పెరుగుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం సమాధానమిస్తూ.. అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) చట్టం 2021, సరోగసీ (నియంత్రణ)చట్టం 2021లోని కొన్ని నిబంధనల రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కేంద్రం వ్యతిరేకించింది. ఈ రెండు చట్టాలోని ప్రతి ఆంశాన్ని పరిశీలించిన తరువాతనే చట్టం చేయడానికి పార్లమెంటు ఆమోదించిందని అఫిడవిట్‌లో పేర్కొంది. 

పిటిషన్‌ను కొట్టివేయాలని కోరుతూ.. సవాలు చేయబడిన నిబంధనలు సహాయక పునరుత్పత్తి సాంకేతికత (ART), అద్దె గర్భం విధానాన్ని నియంత్రిస్తాయి, వీటిని పలుచన చేస్తే, మొత్తం ప్రయోజనం దెబ్బతింటుందని పేర్కొంది. పిండాలు/ గేమేట్స్/ నవజాత శిశువు మొదలైన వాటి వాణిజ్యీకరణను నియంత్రించే ఉద్దేశ్యంతో ఏఆర్టీ చట్టాని రూపొందించబడిందనీ, సరోగసీలో అనుసరించే విధానాలు నియమాలు, నిబంధనల ప్రకారం తగిన పద్ధతులను సూచించబడ్డాయని, ఈ చట్టాల్లో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన లేదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 

దాతృత్వం కోసం మాత్రమే సరోగసీని అనుమతించడం , దాని వాణిజ్య వినియోగాన్ని ఏకపక్షంగా నిషేధించడం వల్ల కుటుంబాల్లోని మహిళల నుండి బలవంతపు శ్రమ మరియు అద్దె గర్భం కోసం అనియంత్రిత మార్కెట్‌కు దారి తీస్తుందని పిటిషన్ దాఖాలైంది.సరోగసి వల్ల వివక్షత, నిర్బంధ వర్గీకరణ రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 కింద హామీ ఇవ్వబడిన హక్కులను ఉల్లంఘిస్తుంది. మహిళల పునరుత్పత్తి హక్కులను ప్రత్యక్షంగా ఉల్లంఘిస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం గోప్యత హక్కును ఉల్లంఘించినట్లు అవుతుందని, అది దానిలో అంతర్భాగమని పిటిషన్‌లో పేర్కొంది. ఈ కేసు నవంబర్ 29న విచారణకు రానుంది. గతంలోనూ ఇలాంటి కేసులు.. సరోగసీ యాక్ట్ 2021, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ యాక్ట్ 2021లోని నిబంధనలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. సరోగసీ చట్టం 2021కి సంబంధించిన బిల్లును పార్లమెంటు ఆమోదించింది. 
 

click me!